బ్యాంక్ లాక‌ర్ ఉందా ? ఏడాదికి ఒక‌సారి అయినా స‌రే చెక్ చేసుకోవాలి. ఎందుకంటే..?

-

మీకు బ్యాంక్ లాక‌ర్లు ఉన్నాయా ? అయితే వాటిని క‌నీసం ఏడాదికి ఒక‌సారి అయినా చెక్ చేసుకోండి. అవును. ఈ విష‌యాన్ని మేం చెప్ప‌డం లేదు. ఆర్‌బీఐ నిబంధ‌న‌లే చెబుతున్నాయి. ఎందుకంటే 3 ఏళ్లుగా బ్యాంక్ లాక‌ర్‌ను ఓపెన్ చేయ‌క‌పోవ‌డం వ‌ల్ల ఒక క‌స్ట‌మ‌ర్‌కు చేదు అనుభవం ఎదురైంది. లాక‌ర్‌కు అద్దె చెల్లిస్తున్నా.. 3 ఏళ్లుగా ఓపెన్ చేయ‌క‌పోవ‌డంతో అత‌ను ఇబ్బందుల్లో ప‌డ్డాడు. ఇంత‌కీ అస‌లేం జ‌రిగిందంటే..?

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఓ క‌స్ట‌మ‌ర్ ఆ బ్యాంక్‌కు చెందిన ఓ బ్రాంచ్‌లో కొన్నేళ్ల కింద‌ట లాక‌ర్‌ను ఓపెన్ చేశాడు. అందులో 7 ఆభ‌ర‌ణాలు ఉంచాడు. 3 ఏళ్లుగా అత‌ను లాక‌ర్‌కు రుసుం చెల్లిస్తున్నాడు. అయితే ఈ 3 ఏళ్ల‌లో లాక‌ర్‌ను ఓపెన్ చేయ‌లేదు. ఈ క్ర‌మంలో ఇటీవ‌లే లాక‌ర్‌ను ఓపెన్ చేసి చూడ‌గా అందులో 7కు బ‌దులుగా 2 ఆభ‌ర‌ణాలు మాత్ర‌మే ఉన్నాయ‌ని గుర్తించాడు. దీంతో వాటిని మాత్ర‌మే బ్యాంక్ సిబ్బంది అతనికి ఇచ్చారు. అయితే దీనిపై అత‌ను సుప్రీం కోర్టు వ‌ర‌కు వెళ్లాడు. ఈ క్ర‌మంలో కోర్టు ఆర్‌బీఐ రూల్స్‌ను చెబుతూ తీర్పు ఇచ్చింది.

బ్యాంక్ లాక‌ర్ల‌ను క‌లిగి ఉన్న‌వారు ఏడాదికి ఒక‌సారి అయినా వాటిని చెక్ చేసుకోవాలి. లేదంటే మొద‌టి ఏడాది అనంత‌రం క‌స్ట‌మ‌ర్ రిస్క్ ప్రొఫైల్‌ను బ‌ట్టి బ్యాంక్ వారికి ఆ లాక‌ర్‌ను క్యాన్సిల్ చేసేందుకు, తెరిచేందుకు, దాన్ని ఇత‌రుల‌కు ఇచ్చేందుకు అధికారం ఉంటుంది. కానీ ఆ క‌స్ట‌మ‌ర్ ఏకంగా 3 ఏళ్లు లాక‌ర్‌ను ఓపెన్ చేయ‌లేదు. కానీ రెంట్ మాత్రం ఇస్తున్నాడు. అయిన‌ప్ప‌టికీ లాక‌ర్‌ను తెర‌వ‌క‌పోవ‌డంతో బ్యాంక్ వారు చేతివాటం ప్ర‌ద‌ర్శించారు. అయితే రూల్స్ ప్ర‌కారం అత‌ను చేసేదేమీ లేదు. కానీ ఆభ‌ర‌ణాలు ఎలా మాయ‌మయ్యాయి అనే విష‌యంలో మాత్రం స్ప‌ష్ట‌త లేదు. అందువ‌ల్ల ఎవ‌రైనా స‌రే లాక‌ర్లు ఉంటే క‌నీసం ఏడాదికి ఒక‌సారి అయినా వాటిని త‌నిఖీ చేసుకోవాల‌ని, అప్పుడే అన్ని రూల్స్ వ‌ర్తిస్తాయ‌ని ఆర్‌బీఐ నిబంధ‌న‌లు చెబుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version