కీడు ఎంచి మేలు ఎంచడంలో తప్పు లేదు ..!

-

పెద్ద వాళ్ళు ఏదైనా చెప్తే చాదస్తం అని కొట్టిపారేస్తాం. ఇది వరకు రోజుల్లో ఇల్లు దాటి బయటకు వెళ్తుంటే పక్కింటి వాళ్లకో, ఎదురింట్లో వారికో, లేదంటే దగ్గర్లో ఉండే బందువుల్లో ఎవరో ఒకరికి ఎక్కడికి వెళ్తున్నాం, ఎప్పుడు వస్తాం అనే వివరాలు చెప్పి వెళ్ళేవారు. వెళ్ళేటప్పుడు కూడా వారి వ్యక్తిగత సమాచారం ఒక కాగితంపై రాసి తమతో పాటు ఉంచుకునే వారు. ఒక వేళ ఏదైనా కారణం చేత వెళ్ళిన చోట ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే,

లేదంటే వారికి ఏదైనా ప్రమాదం జరిగి వారు ఎవరు అనే వివరాలు తెలుసుకునేందుకు వారి వద్ద ఉన్న వివరాల ఆదారం గా బంధువులకు సమాచారం అందజేయడానికి వీలు ఉండేది. కానీ ప్రస్తుత రోజుల్లో అందరూ వారి వారి వ్యక్తిగత వివరాలు పట్ల గోప్యత పాటిస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఆ విషయం కనీసం కుటుంబ సభ్యులకు కూడా పూర్తిగా వివరాలు చెప్పడం లేదు.

అలా కుటుంబ సభ్యులకు చెప్పకుండా బయటకు వెళ్ళినప్పుడు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వివరాలు చెప్పలేని స్థితిలో వారు ఉంటే కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వబడే వీలు ఉండటం లేదు. కొన్ని సార్లు అయితే ప్రమాదాల్లో మృతి చెందిన వారి వివరాలు తెలియక, కనీసం వారి మృతదేహాలు కుటుంబ సభ్యులకు కూడా అందనివి చాలా జరుగుతున్నాయి.

కీడు ఎంచి మేలు ఎంచమన్న సామెత ఇలాంటి వాటికి బాగా పనికి వస్తుంది. కాబట్టి ఎక్కడికైనా వెళ్తే కుటుంబ సభ్యుల లో ఎవరో ఒకరికి సమాచారం ఇవ్వండి, అంతే గాక వెళ్ళేటప్పుడు వెంట ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, కాలేజి ఐడి ప్రూఫ్, ఆఫీస్ ఐడి, ఇలా ఎదో ఒక ఐడెంటిటీ కార్డు వెంట ఉంచుకోండి. ఏదైనా అత్యసర సందర్భం ఎప్పుడు వస్తుంది అనేది ఎవరం చెప్పలేం.

Read more RELATED
Recommended to you

Latest news