ఒకవేళ రిజిస్టర్డ్ నెంబర్ మారితే.. దాన్ని మళ్లీ మార్చుకోవడం ఎలా? దాని కోసం హోమ్ బ్రాంచ్ కే వెళ్లాలా? అనే సందేహాలు కస్టమర్లకు వస్తుంటాయి. అయితే బ్యాంక్ కు వెళ్లకున్నా కస్టమర్లు తమ మొబైల్ నెంబర్ ను మార్చుకోవచ్చు.
భారతదేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ఏదంటే స్టేట్ బ్యంక్ ఆఫ్ ఇండియా. దానికి దేశవ్యాప్తంగా 24 వేలకు పైగా బ్రాంచులు, 59 వేలకు పైగా ఏటీఎంలు, 42 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు. ఏవిధంగా చూసినా… భారత్ లోనే అతి పెద్ద వాణిజ్య బ్యాంక్ అది.
ఈరోజుల్లో బ్యాంకుకు సంబంధించి ఏ లావాదేవీలు చేయాలన్నా రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ తప్పనిసరి. అది ఉంటేనే మొబైల్ బ్యాంకింగ్ అయినా.. నెట్ బ్యాంకింగ్ అయినా.. ఇంకేదైనా? అందుకే మొబైల్ నెంబర్ ను మార్చుకోవడం తప్పనిసరి.ఒకవేళ రిజిస్టర్డ్ నెంబర్ మారితే.. దాన్ని మళ్లీ మార్చుకోవడం ఎలా? దాని కోసం హోమ్ బ్రాంచ్ కే వెళ్లాలా? అనే సందేహాలు కస్టమర్లకు వస్తుంటాయి. అయితే బ్యాంక్ కు వెళ్లకున్నా కస్టమర్లు తమ మొబైల్ నెంబర్ ను మార్చుకోవచ్చు.దానికి రెండు ఆప్షన్లు ఉన్నాయి. ఆన్ లైన్ లేదా ఏటీఎం ద్వారా నెంబర్ ను మార్చుకోవచ్చు.
ఆన్ లైన్ లో అయితే… onlinesbi.com వెబ్ సైట్ లోకి వెళ్లి.. నెట్ బ్యాంకింగ్ కు లాగిన్ అయి అకౌంట్స్ అండ్ ప్రొపైల్స్ సెక్షన్ లో ప్రొఫైల్ పై క్లిక్ చేసి.. పర్సనల్ డిటెయిల్స్ / మొబైల్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. అప్పుడు పర్సనల్ డిటెయిల్స్ పేజీ ఓపెన్ అవుతుంది. ప్రొఫైల్ పాస్ వర్డ్ ను ఎంటర్ చేసి సబ్ మిట్ పై క్లిక్ చేయాలి. అక్కడ మీ పర్సనల్ డిటెయిల్స్ ఓపెన్ అవుతాయి. అక్కడ చేంజ్ మొబైల్ నెంబర్ హైపర్ లింక్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసి మీ కొత్త మొబైల్ నెంబర్ ను ఎంటర్ చేసి సబ్ మిట్ చేయండి. తర్వాత మీకు వచ్చే ఓటీపీ ద్వారా మీ మొబైల్ నెంబర్ ను వెరిఫై చేస్తే చాలు.
లేదంటే.. ఇంటర్నెట్ బ్యాంకింగ్ రిక్వెస్ట్ అప్రూవల్ త్రూ ఏటీఎం కానీ… అప్రూవల్ త్రూ కాంటాక్ట్ సెంటర్ ఆప్షన్ ద్వారా కూడా కొత్త మొబైల్ నెంబర్ ను వెరిఫై చేసుకోవచ్చు.
ఇంటర్నెట్ బ్యాంకింగ్ రిక్వెస్ట్ అప్రూవల్ త్రూ ఏటీఎం ఆప్షన్ ను ఎంచుకుంటే… దాని కోసం డెబిట్ కార్డు ఉండాలి. డిబిట్ కార్డు వివరాలను నెట్ బ్యాంకింగ్ లో సమర్పించిన తర్వాత మొబైల్ నెంబర్ కు రెఫరెన్స్ కోడ్ వస్తుంది. ఆ కోడ్ వచ్చాక ఎస్బీఐ ఏటీఎంకు వెళ్లి రెఫనెన్స్ నెంబర్ ఎంటర్ చేసి మొబైల్ నెంబర్ ను వెరిఫై చేసుకోవచ్చు.