ఏంటీ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఓడిపోతారా?? ఏ సర్వే చెప్పిందని గుస్సా కావొద్దు.. కుప్పం నుండి ఇప్పటి వరకు ఓటమి లేదాయనకు.. ఆయన ఓటమి ఎరుగని ధీరుడని చాలామంది అనుకుంటారు.., దాదాపుగా 14 ఏళ్లు ముఖ్యమంత్రి, కుప్పం నుండి ఇప్పటి వరకు వరుసగా 7 సార్లు గెలిచిన బాబు గారు ఓడిపోయారా అంటూ దీర్గాలు తీయకండి.
అవును మీరు చదివింది కరెక్టే.. ఎప్పుడు? ఎవరి చేతిలో? ఎన్ని ఓట్లతో? అనే ప్రశ్నలకు సమాధానం..అది 1983వ సంవత్సరం, అప్పుడు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ తరుపున చంద్రగిరి నియోజకవర్గం నుండి పోటీ చేశారు. అప్పుడే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టిన సందర్భం.. చంద్రబాబుకు 31 వేల 581 ఓట్లు వచ్చాయి. మరి ప్రత్యర్థికి 50వేల పైచిలుకు ఓట్లు రావడంతో 20 వేల చిల్లర ఓట్లుతో ఓడిపోయారు.
మరి బాబును ఓడించిన పార్టీ ఏదనేగా మీ సందేహం..? ఆయనను ఓడించింది పార్టీ తరుపున పోటీ చేసిన అభ్యర్థి కాదు ఇండిపెండెంట్ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. మరి ఆ అభ్యర్థి పేరు.. పేరు మేడసాని వెంకట రమణ నాయుడు.
అదీ నాయుడు గారి ఓటమి కథ..