ఆర్‌బీఐ (రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) తీసుకున్న తాజా నిర్ణయంతో గృహ, వాహన రుణాలపై వడ్డీ భారం తగ్గనుంది. ఈ మేరకు ఆర్‌బీఐ తాజాగా జరిపిన.. ఈ ఆర్థిక సంవత్సరం రెండో ద్వైమాసిక పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఇవాళ వెల్లడించింది.
మధ్య తరగతి ప్రజలు ఇల్లు లేదా వాహనం ఏదైనా సరే.. ఈఎంఐ పద్ధతిలో కొనుగోలు చేసేందుకు ఆసక్తిని చూపిస్తుంటారు. అందుకనే ఏ దేశంలోనూ లేని విధంగా మన దేశంలో బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు మధ్య తరగతి వారిని ఆకట్టుకునే విధంగా లోన్లను అందిస్తుంటాయి. ఈ క్రమంలోనే ప్రజలు ఎద్ద ఎత్తున ఇల్లు లేదా వాహన రుణాలనే ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అయితే ఆ రుణాలకు వడ్డీ రేట్లు తక్కువగా ఉంటేనే ప్రజలకు ఎంతో మేలు కలుగుతుంది. వారు కట్టాల్సిన వడ్డీ భారం కొంత వరకు తగ్గుతుంది. ఈ క్రమంలోనే ఆర్‌బీఐ మధ్య తరగతి వర్గానికి చెందిన ప్రజలకు శుభవార్త చెప్పింది.
ఆర్‌బీఐ (రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) తీసుకున్న తాజా నిర్ణయంతో గృహ, వాహన రుణాలపై వడ్డీ భారం తగ్గనుంది. ఈ మేరకు ఆర్‌బీఐ తాజాగా జరిపిన.. ఈ ఆర్థిక సంవత్సరం రెండో ద్వైమాసిక పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఇవాళ వెల్లడించింది. అందులో రెపో రేటుపై పావు శాతం తగ్గిస్తున్నట్లు చెప్పింది. ప్రస్తుతం రెపో రేటు 6 శాతం ఉండగా, ఆర్‌బీఐ నిర్ణయంతో అదిప్పుడు 5.75 శాతానికి చేరింది. మరోవైపు రివర్స్ రెపో రేటు, బ్యాంక్ రేటును 5.50, 6 శాతాలకు ఆర్‌బీఐ పెంచింది. దీంతో గృహ, వాహన రుణాలపై ప్రజలకు వడ్డీ భారం తగ్గుతుంది.
అయితే ఆర్‌బీఐ ఈ నిర్ణయాలను తీసుకుంటానికి కారణం.. ఆర్థిక వృద్ధి నెమ్మదించడంతోపాటు ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడమేనని తేలింది. ఈ క్రమంలో ఆర్‌బీఐ నిర్ణయం వల్ల ఎంతో మంది మధ్య తరగతి వర్గానికి చెందిన ప్రజలకు మేలు జరగనుంది. మరి భవిష్యత్తులోనూ ఈ రేటు ఇదే విధంగా ఉంటుందా, లేదా అన్నది వేచి చూస్తే తెలుస్తుంది..!