దేశంలో నిమిషానికి పుట్టేదెందరు… గిట్టేదెంద‌రు…!

-

ఈ భూమి మీద వంద‌ల కోట్ల మంది జ‌నాభా ఉన్నారు. అయితే భార‌త‌దేశంలో నిమిషానికి ఎంత మంచి పుడ‌తారు ? ఎంద మంది మ‌ర‌ణిస్తారు ? అన్న విష‌యంలోకి వెళ్తే.. చాలా ఆస‌క్తిక‌ర విష‌యాలు తెలిసాయి. 2010 జ‌నాభా లెక్క‌ల‌కు భిన్నంగా  ప్ర‌స్తుత దేశ జనాభా  లెక్క‌లు ఉన్నాయి. వాస్త‌వానికి ఎవ‌రైనా జ‌న్మించినా లేదా మ‌ర‌ణించినా 21 రోజుల వ్య‌వ‌ధిలో ప్ర‌భుత్వ రికార్డుల్లో న‌మోదు చేయ‌డంతో దేశ జ‌నాభా ఎంత‌న్న అంశం మీద స‌మాధానం సులువుగా దొరుకుతుంది.

How Many Babies are Born And Died every minute in India

ఇక భార‌త‌దేశ తాజా జానాభా 128.85 కోట్లు అని తేలింది. ఈ లెక్క‌ల ప్ర‌కారం నిమిషంలో 49 మంది పుడుతుంటే అదే నిమిషంలో 15 మంది మ‌ర‌ణిస్తున్నారు. కేవ‌లం ఏడాది వ్య‌వ‌ధిలో దేశ జనాభా 1.45 కోట్లు పెర‌గ‌డం ఆశ్చ‌ర్యానికి గురి చేస్తుంది. ఈ క్ర‌మంలోనే దేశంలో ఉత్తరప్రదేశ్ 22.26 కోట్ల భారీ జ‌నాభాతో మొద‌టి స్టానంలో ఉంటే.. అతి త‌క్కువ జానాభా అంటే కేవలం 6.56 ల‌క్ష‌ల మందితో  సిక్కిం చివ‌రి స్థానంలో నిలిచింది.

అలాగే అత్య‌ధిక జ‌నాభా ఉన్న‌ రెండు, మూడు స్థానాల్లో మ‌హారాష్ట్ర‌, బిహార్ రాష్ట్రాలు ఉన్నాయి. అదే విధంగో నాలుగైదు స్థానాల్లో పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు నిలిచాయి. ఇక తెలుగు రాష్ట్రాల విష‌యానికి వ‌స్తే 3.69 కోట్ల జ‌నాభాతో తెలంగాణ 12 స్థానంలో నిలిస్తే.. 5.23 కోట్ల జ‌నాభాతో ఏపీ 10వ స్థానంలో నిలిచింది. తెలంగాణ జ‌న‌న మ‌ర‌ణాల‌ విష‌యాల్లోకి వ‌స్తే హైదరాబాద్ రెవెన్యూ జిల్లా మెద‌టి స్థానంలో ఉంది.

అలాగే జ‌న‌నాల‌ విష‌యంలో రెండో స్థానంలో నిజామాబాద్ జిల్లా ఉంటే… మ‌రణాల్లో రెండో స్థానంలో వ‌రంగ‌ల్ అర్బ‌న్ నిలించింది. ఇక ఏపీలో విష‌యానికి వ‌స్తే..  తూర్పుగోదావరి, కర్నూలు అధిక జ‌నాభాతో మొద‌టి స్థానంలో ఉంటే మ‌ర‌ణాల్లో మాత్రం గుంటూరు, తూర్పుగోదావ‌రి జిల్లాలు మొద‌టి స్థానంలో నిలిచాయి. మ‌రో ఆస‌క్తిక‌ర విష‌యం ఏంటంటే ఏపీలో ఎక్కువ మంది 54-65 ఏళ్ల మ‌ధ్య చ‌నిపోతుంటే.. తెలంగాణ‌లో 65-69 ఏళ్ల మ‌ధ్య‌లో మ‌ర‌ణిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version