ఐదేళ్లలోపు పిల్ల‌ల‌కోసం “బాల్ ఆధార్ కార్డు” ఎలా పొందాలి.. బెనిఫిట్స్ ఏమిటి?

-

మనకి ఉండే ముఖ్యమైన డాక్యుమెంట్లు లో ఆధార్ కార్డు ఒకటి. ప్రతి ఒక్కరికి తప్పకుండా ఆధార్ కార్డు ఉండాలి. ఎందుకంటే ఆధార్ కార్డ్ చాలా అవసరం. స్కీమ్స్ మొదలు అడ్రస్ ప్రూఫ్ కూడా ఎన్నో వాటికి ఉపయోగ పడుతుంది ఆధార్ కార్డు. అయితే మన దేశం లో ఐదేళ్ల లోపు పిల్లలకి బాలాధార్ కార్డు ఇస్తారు. ఇది నీలం రంగులో ఉంటుంది.

 

బ్లూ ఆధార్ కార్డు ఎలా పొందొచ్చు అనేది ఇప్ప్పుడు చూద్దాం..

మీ సమీప ఆధార్ కేంద్రాన్ని గుర్తించండి. ఆ తరవాత అపాయింటుమెంట్ తీసుకుని సమీపంలోని ఆధార్ కేంద్రానికి పిల్లలను తీసుకు వెళ్లాలి. మీరు బయోమెట్రిక్ అప్ డేట్ పూర్తి చేసుకోవాలి.

ముందు appointments.uidai.gov.in/easearch.aspx?AspxAutoDetectCookieSupport=1 లోకి వెళ్లి.. .
రాష్ట్రం, పోస్టల్ కోడ్, మీ రిలీజియన్‌ను సెలెక్ట్ చేసుకోండి.
ఇక్కడ అడిగిన డీటెయిల్స్ ఇవ్వండి.
నెక్స్ట్ మీరు Locate Centre ఆప్షన్ పైన క్లిక్ చేయండి.
మీరు స్థానిక ఆధార్ కేంద్రాన్ని కనుగొని, అపాయింటుమెంట్ ఇచ్చాక మీ పిల్లల బయోమెట్రిక్ వివరాలను అప్ డేట్ చేయడానికి తీసికెళ్ళాల్సి ఉంటుంది.

రిజిస్ట్రేషన్ కోసం:

UIDAI అధికారిక వెబ్ సైట్‌ను ఓపెన్ చెయ్యండి.
ఆధార్ కార్డు రిజిస్ట్రేషన్ ఎంపిక పైన క్లిక్ చేయాలి.
మీ పిల్లల పేరు, మొబైల్ నెంబర్, అడ్రస్, ప్రాంతం, రాష్ట్రం వంటి వివరాలు ఇవ్వాలి.
Appointment పైన క్లిక్ చేయాలి.
సమీపంలోని ఆధార్ సేవా కేంద్రం లేదా ఆధార్ నమోదు స్థితిని ఎంచుకోవాలి.
నెక్స్ట్ మీరు షెడ్యూల్ చేసిన తేదీన మీరు మీ పిల్లలతో ఆధార్ కేంద్రాన్ని సందర్శించాలి. ఐడెంటిటీ ప్రూఫ్, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్, ప్రూఫ్ ఆప్ రిలేషన్‌షిప్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ అవసరం అవుతాయి.
పిల్లల వయస్సు అయిదేళ్లు ఉంటే బయోమెట్రిక్ డేటా అవసరం. పిల్లల వయస్సు అయిదేళ్ల కంటే తక్కువ ఉంటే అవసరం లేదు.
బయోమెట్రిక్ వివరాలను విజయవంతంగా పూర్తైన తర్వాత మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు రిసిప్ట్ వస్తుంది. మీ పిల్లల బాల్ ఆధార్ కార్డు 90 రోజుల్లో మీ ఇంటికి చేరుతుంది.

ఈ కార్డు వలన కలిగే లాభాలివే:

ఐదేళ్ల కంటే తక్కువ వయస్సు ఉంటే ట్రైన్స్ మరియు ఫ్లైట్స్ లో ప్రయాణం చెయ్యడానికి ప్రూఫ్ గా ఉపయోగ పడుతుంది.
చాలా స్కూల్స్ అడ్మిషన్ సమయంలో ఈ ఆధార్ ని అడుగుతాయి.

నీలం రంగులో ఉండే ఈ బాలాధార్ కార్డు ని పిల్లాడికి ఐదేళ్లు దాటగానే దానిని మార్పించుకోవాల్సి ఉంటుంది. లేదు అంటే అది చెల్లదు అని గమనించాలి.

మీకు ఏమైనా సందేహాలు ఉన్నా ఏమైనా వివరాలు కావాలన్నా 1947 టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేసి మీ సందేహాలని క్లియర్ చేసుకోవచ్చు.

 

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news