ఆంధ్ర ప్రదేశ్ స్టానిక సంస్థలకు ఇటీవల ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అయితే స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల కౌంటింగ్ ఈ రోజు జరుగుతుంది. ఇప్పటి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అయింది. నెల్లూరు కార్పొరేషన్ తో పాటు కుప్పం, ఆకివీడు, జగ్గయ్య పేట, కొండపల్లి, దాచే పల్లి, గురజాల, దర్శి, బుచ్చిరెడ్డి పాలెం, పెనుకొండ, రాజం పేట, కమలాపురం, బేతం చర్ల మున్సిపలిటీ లలో ఎన్నికలు జరిగాయి. అయితే ఈ మున్సిపాలిటీ ల తో పాటు నెల్లూరు కార్పొరేషన్ లలో కౌంటింగ్ మొదలైంది. ఈ ఎన్నికలలో దాదాపు 1206 అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
అయితే అందరి దృష్టి మాత్రం చిత్తూర్ జిల్లా కుప్పం మున్సిపాలిటీ పైనే ఉంది. కుప్పం రిజల్ట్ కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఆసక్తి ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పటి కే ప్రారంభమైన కౌంటింగ్ లో కుప్పం మున్సిపాలిటీ లో ఒక స్థానంలో వైఎస్ఆర్‌సీపీ ఆధిక్యం లోకి వచ్చింది. దీంతో టీడీపీ వర్గాల్లో ఆందోళన మొదలైంది. కాగ కుప్పం మున్సిపాలిటీ లో మొత్తం 25 స్థానాలు ఉన్నాయి.