ప్రతి భారత పౌరుడికి ఆధార్ కార్డు అన్నది తప్పనిసరి. ఏడాది పిల్లల నుంచి పండు ముసలి వారి దాకా ప్రతి ఒక్కరికి కూడా ఆధార్ కార్డు ఉండాల్సిందే. ప్రస్తుత రోజుల్లో ఆధార్ కార్డు అన్నది ముఖ్యమైన డాక్యుమెంట్ గా మారిపోయింది. గవర్నమెంట్ కి సంబంధించిన ప్రతి పనికి కూడా ఇది చాలా అవసరం. బ్యాంకు అకౌంట్,పాన్ కార్డ్ వంటి సేవలతో పాటుగా ప్రభుత్వ ప్రైవేటు పథకాలకు కూడా ఈ ఆధార్ కార్డు అన్నది తప్పనిసరి అయిపోయింది. అయితే మరి అలాంటి ఆధార్ కార్డులో పేరు, డేటాఫ్ బర్త్,జెండర్ ఇంకా ఇంటి అడ్రస్ ఇలా ప్రతి ఒకటి కూడా కరెక్ట్ గా ఉండాలే చూసుకోవాలి.అందులో ఏ ఒక్కటీ కూడా సరిగా లేకపోయినా సరే చూసుకోమని నిపుణులు ఇంకా ప్రభుత్వ అధికారులు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉంటారు.
ఇది ఇలా ఉంటే ఒకవేళ మీ ఆధార్ కార్డులో మీ మొబైల్ నెంబర్ ను మార్చుకోవాల్సి ఉంటే అలాంటప్పుడు ఏం చేయాలి ఇంకా అలాగే సులువుగా ఎలా మార్చుకోవాలో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం.. అయితే ఆధార్ కార్డులో మొబైల్ నంబర్‌ను మార్చుకునే పని చాలా సులభంగా చేసుకోవచ్చు.ఆధార్ కార్డులో మీ మొబైల్ నంబర్ కనుక తప్పుగా ఉంటే, మీరు వెంటనే దాన్ని మార్చుకోవచ్చు. లేదా మీరు వేరే నంబర్‌ను యాడ్ చేయాలన్నా కూడా సులభంగా యాడ్ చేసుకోవచ్చు. కానీ మీరు ఆన్‌లైన్‌లో మాత్రం మొబైల్ నంబర్ ను మార్చలేరు.
మీరు మీ ఇంటికి దగ్గర లోని ఈ సేవా కేంద్రాల్లో మాత్రమే మీ మొబైల్ నంబర్ ను మార్చుకునేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఇందుకోసం ఆధార్ ఇ సేవా కేంద్రానికి మీరు వెళ్లి మొబైల్ నెంబర్ అప్డేట్ చేయమని అడగాలి. అప్పుడు అక్కడ వారు ఒక ఫారమ్ ఇస్తారు దాన్ని తీసుకోవాలి. అందులో మీరు ఉపయోగించాలనుకుంటున్న మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయాలి. ఆ తర్వాత చేతిముద్ర, కంటి నమోదు చేయించుకోవాలి. ఆ తర్వాత నింపిన ఫారాన్ని మీసేవ కేంద్రాల అధికారులకు మీరు అందజేయాలి. ఇందుకు మొత్తం రూ.50 రుసుము వసూలు చేస్తారు. ఇక దీన్ని అనుసరించి మార్పులు చేయడానికి మీకు నంబర్ ఇవ్వబడుతుంది. ఆధార్ వెబ్‌సైట్ ద్వారా ఆ నంబర్‌తో మీ మొబైల్ నంబర్ మారిందో లేదో మీరు చెక్ చేసుకోవచ్చు. దాంతో మీ మొబైల్ నంబర్ 90 రోజుల్లో అప్‌డేట్ అవుతుంది.