అలా ఉంటే పాలు కల్తీయేనా…? పాలల్లో కల్తీని ఏ విధంగా గుర్తించవచ్చు…?

-

నూనె నుంచి పాలు, ఏవేవో రసాయనాల నుంచి పాలు… అసలు గేదెల పాలు అనేవి దొరకని పరిస్థితి… అవును ఇప్పుడు దాదాపుగా పరిస్థితి ఎక్కడ చూసినా ఇలాగే ఉంది. పాల ప్యాకెట్ల పాలు అయినా, ఇళ్ళ వద్దకు వచ్చి పోసే పాలు అయినా సరే కల్తీనే. ఎక్కడో గ్రామాల్లో మినహా పట్టణ ప్రాంతాల్లో ప్రతీ ఇంట్లో పొంగే పాలు కల్తీనే. అసలు పాలల్లో పాలు ఉండటం లేదని అంటున్నారు అంటే… పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు… కల్తీ పాల తయారి మీద ఎన్ని చర్యలు తీసుకున్నా సరే… కల్తీని ఆపడం సాధ్యం కాని పరిస్థితి.

అసలు పాలల్లో కల్తీని ఏ విధంగా గుర్తించవచ్చు…? దీనికి కాస్త జ్ఞానం ఉంటే చాలు అంటున్నారు… అవి ఏంటో ఒక్కసారి చూద్దాం… ఈ రోజుల్లో ఆవు పాలు ఎక్కువగా వస్తున్నాయి… పాలు తోడు పెట్టినప్పుడు… పెరుగు మీద మీగడ పసుపు రంగులో ఉంటే అందులో కచ్చితంగా ఆవు పాలు కలిసినట్టే… పాలల్లో వేలు పెట్టి ముంచితే… పాలకు తుడుచుకున్న తర్వాత బంకలా వస్తుంది… అలా రాకుండా… వేలు ముంచినప్పుడు నూనె తరహా అనుభూతి కలిగినా అవి కల్తీ పాలే… అదే విధంగా పెరుగు తినేటప్పుడు,

ఐస్ క్రీం లా ఉంటుంది… మీగడ తరహాలో ఉంటుంది. అలా కాకుండా గడ్డలా వచ్చి… గాజు పెంకులా ఆ గడ్డ పగిలితే పాలు కల్తీ కానట్టే… ఇక మజ్జిగ చేసిన రెండో రోజు పులవకుండా వాసన వస్తే ఆ పాలు నూటికి నూరు శాతం కల్తీనే. పాలు కల్తీ కాకపోతే… మాత్రం పెరుగు వాసన రాదూ పులిచిపోతుంది… దాదాపు ప్యాకెట్ పాలు అన్నీ కూడా ఇదే విధంగా ఉన్నాయి. నగరాల్లో తప్పక తాగడమే గాని అవి సురక్షితం కాదని కొన్ని రకాల వ్యాధులకు ఆ పాలు కారకమని… అవసరమైతే మినహా పాలు వాడొద్దని వైద్యులు సూచిస్తున్నారు అంటే బయట పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news