ఫోన్ నెంబర్ లేకున్నా ఆధార్‌లో వివరాలను మార్చుకోవచ్చు.. ఇలా చేస్తే చాలు..!

ఆఫ్‌లైన్‌లో పేరు, ఫోన్ నెంబర్, అడ్రస్, పుట్టిన తేదీ వివరాలు అప్‌డేట్ చేసుకోవచ్చు. అయితే.. ఏది మార్చాలన్నా దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఖచ్చితంగా ఉండాలి.

ఆధార్ కార్డు.. ఇప్పుడు ఏం కావాలన్నా.. ఏది తీసుకోవాలన్నా ఆధార్ కార్డే ప్రామాణికం. ఆధార్ కార్డు లేదంటే ఏమీ చేయలేని పరిస్థితి. ఆధార్ కార్డులో ఉన్న వివరాలనే అన్నింటికీ ఉపయోగిస్తున్నారు. అయితే.. ఆధార్ కార్డులో ఏదైనా మార్పులు చేయాలంటే ఖచ్చితంగా మొబైల్ నెంబర్‌ను లింక్ చేసుకోవాలని లేకపోతే ఆధార్‌లో ఏవైనా మార్పులు చేయడానికి అవకాశం ఉండదని చాలామంది చెబుతుంటారు.

అయితే.. ఆధార్‌తో మొబైల్‌ను లింక్ చేసుకోకపోయినా కూడా ఆధార్‌లో వివరాలను మార్చుకోవచ్చు. దాని కోసం ఆఫ్‌లైన్ ఆధార్ సెంటర్‌కు వెళ్లాలి. అక్కడ వివరాలను అప్‌డేట్ చేయొచ్చు.

How to update aadhaar details without mobile number linking

ఆధార్ కార్డు కరెక్షన్ ఫామ్‌ను తీసుకొని, ఆ ఫామ్‌ను నింపాలి. ఎక్కడ వివరాలు మార్చాలో ఆ వివరాలను ఫామ్‌లో కరెక్ట్‌గా ఇవ్వాలి. ఆధార్ కార్డు జీరాక్స్‌ను దానికి జతచేసి సబ్మిట్ చేయాలి. వెరిఫికేషన్ కోసం బయోమెట్రిక్ వివరాలు కూడా ఇవ్వాలి. వాళ్లు ఒక రశీదు ఇస్తారు. 2 నుంచి 5 రోజుల్లో ఆధార్ కార్డుకు ఫోన్ నెంబర్ అనుసంధానం అవడంతో పాటుగా ఇతర వివరాలు కూడా అప్‌డేట్ అవుతాయి.

ఆఫ్‌లైన్‌లో పేరు, ఫోన్ నెంబర్, అడ్రస్, పుట్టిన తేదీ వివరాలు అప్‌డేట్ చేసుకోవచ్చు. అయితే.. ఏది మార్చాలన్నా దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఖచ్చితంగా ఉండాలి. ఆధార్ సెంటర్‌లో ఏ వివరాలు మార్చాలన్నా 25 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో అయితే ఉచితంగానే చేసుకోవచ్చు. అయితే.. ఆన్‌లైన్‌లో వివరాలు మార్చాలంటే మాత్రం మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి.