పెట్టుబడి పెట్టేందుకు ప్రభుత్వం ఎన్నో రకాల పథకాలను అందిస్తుంది..అందులో కొన్ని పథకాలకు మంచి డిమాండ్ ఉంది.ఈ మధ్య చిన్న చిన్న పొదుపులు చేసేవారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూ వస్తుంది.చిన్న మొత్తంలో పొదుపు చెయ్యడం చాలా మంచిది.భవిష్యత్తులో అవసరాలను పనికి వస్తుంది.చిన్న పొదుపులను ఒక అలవాటుగా చేసుకుంటే రాబోయే సంవత్సరాల్లో అది భారీ మొత్తం అవుతుంది..ప్రతిరోజూ రూ. 200 ఆదా చేసి ప్రతి నెలా ప్రభుత్వ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పిపిఎఫ్) పథకంలో పెట్టుబడి పెడితే 20 ఏళ్లలో మీకు 32 లక్షల రూపాయల ఫండ్ క్రియేట్ అవుతుంది.
మీరు ప్రతిరోజూ 200 రూపాయలు ఆదా చేస్తే ప్రతి నెలా 6000 రూపాయలు ఆదా అవుతాయి. ఇలా 20 సంవత్సరాల పాటు మెయింటెయిన్ చేస్తే మెచ్యూరిటీపై రూ. 3,195,984 పొందుతారు. మీ వయస్సు 25, నెలవారీ ఆదాయం 30-35 వేలు ఉంటే ప్రారంభ రోజుల్లో మీకు పెద్దగా బాధ్యత ఉండదు. కాబట్టి రోజుకు రూ. 200 ఆదా చేయడం సులభం. ఈ విధంగా 45 సంవత్సరాల వయస్సులో మీరు పీపీఎఫ్ నుంచి సుమారు రూ.32 లక్షల రాబడిని పొందవచ్చు…