కొత్త సేవలని ఇండియన్ రైల్వేస్ తీసుకు రావడం జరిగింది. ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్లో ఇండియన్ రైల్వేస్ ఈ సేవలని షురూ చేసింది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. పాడ్ హోటల్‌ను ఏర్పాటు చేసింది ఇండియన్ రైల్వేస్. రైల్లో ప్రయాణం చేసి అలసిపోయినట్టు ఉంటే ఈ రూమ్స్ లో ప్రయాణికులు రెస్ట్ తీసుకోవచ్చు.
బయట చిన్న ట్రిప్ ఉన్నా అది చూసి వచ్చి రెస్ట్ తీసుకోవచ్చు. ఇక్కడ అన్ని రకాల ఫెసిలిటీస్ ఉంటాయి. 12 నుంచి 24 గంటల వరకు ఉండొచ్చు. ధర రూ.999 నుంచి స్టార్ట్ అవుతుంది. రూ.2499 వరకు ఉంటుంది. ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్లో ఫస్ట్ ఫ్లోర్ లో దీనిని మొదలు పెట్టారు.
ఇప్పుడు అయితే 48 పాడ్ రూమ్స్‌ను అందుబాటులో ఉంచారని తెలుస్తోంది. అయితే ఈ రూమ్స్ లో రెండు రకాలు వున్నాయి. ప్రైవేట్ పాడ్, క్లాసిక్ పాడ్ అనే రెండు రకాలు ఉంటాయి. మహిళలకు, వికలాంగుల కోసం ప్రత్యేక పాడ్లు ఏర్పాటు చేస్తారు ఫ్రీ వైఫై పొందొచ్చు.
క్లీన్ వాష్‌రూమ్, లగేజ్ రూమ్, షోవర్ రూమ్, కామన్ ఏరియా, టీవీ, చార్జింగ్ పాయింట్లు వంటి సౌకర్యాలు ఇక్కడ ఉంటాయి. అయితే ఈ సౌకర్యాలు మాత్రం ప్రయాణికులకు బాగా ఉపయోగ పడతాయి. అలానే ఎంతో రిలీఫ్ గా ఉంటుంది.