ఫలక్ నుమా ప్యాలెస్ గురించి ఆసక్తికరమైన విశేషాలు మీకోసం..!

-

హైదరాబాద్ లో ఉన్న ఫలక్ నుమా ప్యాలెస్ కి వెళ్లిన దాని యొక్క చరిత్ర, గొప్పతనం తెలియక పోయి ఉండొచ్చు. ఫలక్‌నుమా ప్యాలెస్ హైద్రాబాద్ చారిత్రక కట్టడాల్లో ఒకటి! దీని గురించి ఇక్కడ అనేక విషయాలని పొందుపరచడం జరిగింది. మరి ఆలస్యం ఎందుకు ఇప్పుడే ఈ ఫలక్ నుమా ప్యాలెస్ గురించి చూసేయండి…. ఫలక్‌నుమా అనే ఉర్దూ పదానికి తెలుగు లో “ఆకాశ దర్పణం” అనే అర్థం వస్తుంది. ఈ ప్రదేశం చార్మినార్ కి అతి దగ్గరలో ఉంది.

ఇప్పుడు ఈ ఫలక్‌నుమా ప్యాలెస్ ని ప్రస్తుతం తాజ్ హోటల్ గ్రూప్స్ అద్దెకు తీసుకొని నడిపిస్తున్నారు. ఈ సంగతి కూడా తెలిసినదే. అయితే ఈ ప్యాలెస్‌ను విలియం వార్డ్ మారెట్ అనే శిల్పి ‘ఆండ్రియా పల్లాడియో’ శైలిలో నిర్మించాడు. నిజంగా ఇది అద్భుతమైన విషయం. ఈ ఫలక్‌నుమా ప్యాలెస్ నిర్మాణానికి అప్పటి హైదరాబాద్ ప్రధాని అయిన నవాబ్ సర్ వికార్ ఉల్ ఉమ్రా 1884 మార్చి 3న పునాదిరాయి వేశారు. దీనిని నిర్మించడానికి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా తొమ్మిది సంవత్సరాలు పట్టింది. దాదాపు 32 ఎకరాల్లో ఉన్న ఈ ప్యాలెస్ ని నిర్మించారు అంటే మామూలు విషయమా..? ఇక ఎంత ఖర్చు అయ్యింది అనే విషయానికి వస్తే… సుమారు 40 లక్షల రూపాయల వరకు ఖర్చు అయింది.1897-98 కాలం వరకు ఈ ప్యాలెస్ ను సర్ వికార్ తన వ్యక్తిగత నివాసంగా ఉపయోగించుకున్నాడు.

ఏడవ నిజాం చేతుల్లోకి వచ్చే సరికి ఫలక్‌నుమా ప్యాలెస్‌ను ‘రాయల్ గెస్ట్ హౌస్‌’గా వినియోగించారు. 101 మంది భోజనం చేయడానికి వీలైన అతిపెద్ద డైనింగ్ టేబుల్ ఈ ఫలక్ నుమా ప్యాలెస్ లో ఉంది. ఆ తర్వాత 2000లో ఈ ప్యాలెస్ ను తాజ్ హోటల్ గ్రూప్స్ అద్దెకి తీసుకుని రీమోడలింగ్ చేసారు. ఒక్క రాత్రి బస చేయాలంటే సుమారుగా రూ. 46,000 చెల్లించాల్సి ఉంటుంది. భోజనం చేయాలంటే కనీసం ఐదు వేల రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది

Read more RELATED
Recommended to you

Exit mobile version