హైదరాబాద్ నుంచి కాశీ, అయోధ్య వంటి ప్రదేశాలని చూడాలని అనుకుంటున్నారా..? అయితే తప్పక వీటి కోసం చూడాల్సిందే. ‘ఐఆర్‌సీటీసీ గంగా రామాయణ్ యాత్ర’ పేరుతో ఈ ప్యాకేజీ ని తీసుకు వచ్చింది. వివరాల లోకి వెళితే… హైదరాబాద్‌లో 2021 ఏప్రిల్ 7న ఇది స్టార్ట్ అవుతుంది. మొత్తం ఈ టూర్ 4 రాత్రులు, 5 రోజుల టూర్. వివరాలను https://www.irctctourism.com/ వెబ్‌సైట్‌లో చూడచ్చు.
ఇది 2021 ఏప్రిల్ 7న ఉదయం 8.50 గంటలకు హైదరాబాద్‌లో స్టార్ట్ అవుతుంది. 8.50 గంటలకు హైదరాబాద్‌లో ఫ్లైట్ ఎక్కితే ఉదయం 10.50 గంటలకు వారణాసి చేరుకుంటారు. ఆ తరువాత హోటల్‌లో చెక్ ఇన్ అయిన తర్వాత కాశీ విశ్వనాథ ఆలయం, గంగా ఘాట్ చూసి అక్కడే స్టే చెయ్యాలి. ఆ తరువాత రెండవ రోజు ఉదయం విశ్వనాథ ఆలయం చూసి ప్రయాగ్‌రాజ్ బయల్దేరాలి. అక్క డ త్రివేణి సంగమం, అలోపి దేవి ఆలయం చూసి అక్కడే బస చేయాలి.
మూడో రోజు అయితే ఉదయం హోటల్ నుంచి చెక్ ఔట్ అయ్యి శృంగ్వేర్‌పూర్ స్టార్ట్ అవ్వాలి. అక్కడ నుండి అయోధ్యకు తీసుకెళ్తారు. అయోధ్యలో సైట్ సీయింగ్ ఉంటుంది. రాత్రికి అయోధ్య లేదా ఫైజాబాద్‌లో స్టే చెయ్యాలి. నాలుగో రోజు ఉదయం నైమీశరణ్య, స్థానిక ఆలయాలను సందర్శించాలి.నెక్స్ట్ లక్నోకు తీసుకళ్తారు. అక్కడే బస చేయాలి.
ఇక ఐదవ రోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తర్వాత చెక్ ఔట్ కావాలి. బారా ఇమాంబారా, అంబేద్కర్ మెమోరియల్ పార్క్ సందర్శించాలి. లక్నో లో రాత్రి 7.10 గంటలకు ఫ్లైట్ ఎక్కితే రాత్రి 9.15 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. ఇక దీని ధరల విషయంపై వస్తే… ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర రూ.23,550 , డబుల్ ఆక్యుపెన్సీ ధర రూ.24,700, సింగిల్ ఆక్యుపెన్సీ ధర రూ.30,200.