అదిరే లాభాలనిచ్చే LIC హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలసీ..!

-

మీరు ఏదైనా ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోవాలని అనుకుంటున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. LIC కొత్త హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలసీని అందిస్తోంది. ఆరోగ్య రక్షక్ (Arogya Rakshak) పేరుతో ఈ పాలసీ వచ్చింది. ఈ పాలసీ తీసుకోవడం వలన అదిరే లాభాలని ఎన్నో పొందొచ్చు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే.. 65 ఏళ్ల లోపు తల్లిదండ్రులు, 20 ఏళ్ల లోపు పిల్లలకు ఆరోగ్య బీమా లభిస్తుంది. హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలసీ బెనిఫిట్ ఎంతకైనా ఎంచుకోవచ్చు.

lic

అలానే హాస్పటలైజేషన్, సర్జరీ, అంబులెన్స్ బెనిఫిట్, హెల్త్ చెకప్ లాంటివి కవర్ అవుతాయి. పాలసీదారుడు మరణిస్తే కుటుంబ సభ్యులు ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ పాలసీ తీసుకునే వారికీ కనీసం 18 ఏళ్లు. గరిష్ట వయస్సు 65 ఏళ్లు. పిల్లల వయస్సు 91 రోజుల నుంచి 20 ఏళ్ల లోపు ఉండాలి. రూ.2,500 నుంచి రూ.10,000 వరకు డైలీ బెనిఫిట్ ఎంచుకోవచ్చు.

రూ.2,50,000 నుంచి రూ.10,00,000 వరకు మేజర్ సర్జికల్ బెనిఫిట్ పొందొచ్చు. ఈ పాలసీలో భార్యను, పిల్లల్ని, తల్లిదండ్రుల్ని చేరిస్తే ప్రీమియం పెరుగుతుంది. పాలసీదారుడు, జీవిత భాగస్వామి, పిల్లలు, తల్లిదండ్రుల వయస్సును బట్టి ప్రీమియం మారుతుంది.

ఉదాహరణకు 20 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి రోజూ రూ.5000 డైలీ బెనిఫిట్ ఎంచుకొని ఎల్ఐసీ ఆరోగ్య రక్షక్ పాలసీ తీసుకుంటే రూ.7,884 ప్రీమియం చెల్లించాలి. 30 ఏళ్ల వ్యక్తి రూ.9,543 ప్రీమియం, 40 ఏళ్ల వ్యక్తి రూ.12,381 ప్రీమియం, 50 ఏళ్ల వ్యక్తి రూ.17,254 ప్రీమియం చెల్లించాలి.

Read more RELATED
Recommended to you

Latest news