రేవంత్ ఎఫెక్ట్: సైకిల్ దిగనున్న దయాకర్..?

-

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పరిస్తితి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ పార్టీ దాదాపు కనుమరుగయ్యే స్థితిలో ఉంది. ఏదో పేరుకు మాత్రం పార్టీ ఉంది గానీ, పార్టీకి ఉనికి మాత్రం లేదు. ఇప్పటికే దాదాపు 90 శాతం నాయకులు ఆ పార్టీని వీడారు. నాయకులు వీడితే పర్లేదు. మారిన రాజకీయాల నేపథ్యంలో క్యాడర్ కూడా టీడీపీకి దురమైంది. దీంతో తెలంగాణలో టీడీపీ దాదాపు క్లోజ్ అయ్యే స్టేజ్‌కు వచ్చేసింది.

రేవంత్ రెడ్డి | Revanth Reddy
రేవంత్ రెడ్డి | Revanth Reddy

అందుకనే టీడీపీలో ఉంటే మనుగడ కష్టమని చెప్పి, ఆ పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ సైతం టీఆర్ఎస్‌లోకి జంప్ చేశారు. దీంతో చంద్రబాబు..సీనియర్ నాయకుడు బక్కని నర్సింహులుకు అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. నర్సింహులు బాధ్యత తీసుకున్నా సరే పార్టీ పరిస్తితి అలాగే ఉంది. ఈ క్రమంలోనే టీడీపీని వీడాలని మరో సీనియర్ నాయకుడు సిద్ధమయ్యారని తెలుస్తోంది. ఎన్నో ఏళ్ల నుంచి పార్టీ కోసం కృషి చేస్తున్న కొత్తకోట దయాకర్ రెడ్డి సైతం టీడీపీలో ఉంటే రాజకీయ మనుగడ సాగించడం కష్టమని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.

ఎన్నో ఏళ్ళు పార్టీకి సేవ చేస్తూ వస్తున్న దయాకర్, టీడీపీలో అనేక పదవులు చేపట్టారు. 2009లో అయితే దయాకర్‌తో పాటు ఆయన భార్య సైతం టీడీపీ తరుపున ఎమ్మెల్యేగా గెలిచారు. దయాకర్…మక్తల్ నుంచి…సీత దయాకర్…దేవరకద్ర నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక ఆ తర్వాత నుంచి తెలంగాణలో టీడీపీ పరిస్తితి ఎలా తయారైందో చెప్పాల్సిన పని లేదు.

పైగా ఇటీవల అధ్యక్షుడు మార్పు సమయంలో దయాకర్…నారా లేదా నందమూరి ఫ్యామిలీలకు చెందిన వారికి బాధ్యతలు అప్పగిస్తే పార్టీ పరిస్తితి మెరుగయ్యేదనే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిసింది. కానీ చంద్రబాబు, బక్కనికి బాధ్యతలు అప్పగించారు. దీంతో అసంతృప్తికి గురైన దయాకర్…చాలా రోజుల నుంచి పార్టీలో కనిపించడం లేదు. అటు దయాకర్..అనుచరులు సైతం ఆయన్ని కాంగ్రెస్‌లో చేరాలని ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఆయన పుట్టినరోజు సందర్భంగా టీడీపీ కలర్ ఉండే ఫ్లెక్సీలు కాకుండా, కాంగ్రెస్ కలర్ ఉండే ఫ్లెక్సిలు కట్టారు. దీని బట్టి దయాకర్‌ని కాంగ్రెస్‌లోకి వెళ్లాలని అనుచరులు ఒత్తిడి చేస్తున్నట్లు కనబడుతోంది. అయితే రాజకీయ పరిస్తితులని అంచనా వేసుకుని దయాకర్ కూడా త్వరలోనే టీడీపీని వీడటానికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. మొత్తానికి తెలంగాణలో టీడీపీ దుకాణం క్లోజ్ చేసుకునే సమయం దగ్గర పడినట్లే కనబడుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news