ఎల్‌ఐసీ: అదిరిపోయే పాలసీ…రూ.100 కడితే చాలు!

Join Our Community
follow manalokam on social media

ఎల్‌ఐసీ ఇప్పటికే ఎన్ని రకాల బెనిఫిట్స్ ని అందిస్తోంది. అయితే ఎల్‌ఐసీ నుంచి తక్కువ ప్రీమియం తో ఒక పాలసీ ఇప్పుడు అందుబాటు లో ఉంది. ఈ పాలసీ లో కనుక చేరితే కుటుంబానికి ఆర్థిక భద్రత లభిస్తుంది. పైగా మీరు ఎక్కువ కూడా ఇందులో వెచ్చించక్కర్లేదు. మరి ఇక దీని కోసం పూర్తిగా చూస్తే… ఎల్‌ఐసీ ఎన్నో రకాల పాలసీలు అందిస్తోంది. వీటిలో మైక్రో ఇన్సూరెన్స్ పాలసీలు కూడా ఉన్నాయి. దానిలో ఆమ్ ఆద్మీ బీమా యోజన కోసం చెప్పుకోవాల్సిందే. అదిరిపోయే ఈ పాలసీ కోసం రూ.30 వేల బీమా మొత్తానికి కేవలం రూ.100 చెల్లిస్తే సరిపోతుంది.

LIC
LIC

అసంఘటిత రంగం లోని ఉన్న కోసం కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ తీసుకు వచ్చింది. ఎల్‌ఐసీ ఈ స్కీమ్ అమలు చేస్తోంది. ఇక ఎవరు అర్హులు అనే విషయానికి వస్తే… 18 నుంచి 59 ఏళ్ల లోపు వయసు కలిగిన వారు దీనిని తీసుకోవచ్చు. అయితే ఈ పాలసీ తీసుకోవాలంటే ఇంట్లో కుటుంబ పెద్ద అయ్యి ఉండాలి లేదు అంటే సంపాదించే వ్యక్తి అవ్వాలి. అలానే పేదలు అయ్యి ఉండాలి. ఇది ఇలా ఉండగా రేషన్ కార్డు, బర్త్ సర్టిఫికెట్, ఓటర్ ఐడీ, ఆధార్ కార్డు వంటి డాక్యుమెంట్లు ఇందులో చేరడానికి కావాలి.

ఈ పాలసీ తీసుకున్న వారు సహజ మరణం పొందితే కుటుంబ సభ్యులకు రూ.30 వేలు అందిస్తారు.ఒకవేళ ప్రమాదవశాత్తు మరణిస్తే నామినీకి రూ.75,000 లభిస్తాయి. ఒకవేళ పాక్షిక అంగవైకల్యం సంభవిస్తే.. రూ.37,500 వస్తాయి. శాశ్వత అంగ వైకల్యం సంభవిస్తే రూ.75 వేలు అందిస్తారు. పైగా పిల్లలకి స్కాలర్‌షిప్ కూడా వస్తుంది. దీనిలో జాయిన్ అవ్వాలంటే రూ.30 వేల బీమా మొత్తానికి ఏడాదికి రూ.200 ప్రీమియం చెల్లించాలి. అయితే సగం ప్రభుత్వం చెల్లిస్తుంది. మిగిలినవి మీరు కట్టాలి. 9 నుంచి 12వ తరగతి లోపు ఉన్న విద్యార్థులకు ఈ స్కాలర్ షిప్స్ వస్తాయి. ఒక కుటుంబం లో గరిష్టంగా ఇద్దరు పిల్లలకు ఉపకార వేతనం లభిస్తుంది.

 

TOP STORIES

నీ లోపలి బాధలే కాదు, నీ బయట ఏం జరుగుతుందో తెలుసుకోకుంటే అలాగే మిగిలిపోతావని తెలిపే కథ..

ఒక కొండమీద నివాసముండే అమ్మాయి నీళ్ళకోసం కొండదిగి నది వద్దకు వస్తూంటుంది. భుజం మీద కావిడి పట్టుకుని రెండు కుండల్లో నీళ్ళు పట్టుకుని కొండమీదకి వెళ్తుండేది....