LIC పాలిసీతో నలబై ఏళ్ళ నుండి పెన్షన్ పొందచ్చు..!

-

లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫ్ కార్పొరేషన్ ఎన్నో రకాల సేవలని అందిస్తోంది. వీటితో కస్టమర్స్ ఎన్నో రకాల ప్రయోజనాలు పొందొచ్చు. అయితే చాల మంది పెన్షన్ స్కీమ్స్ లో డబ్బులు పెట్టాలని అనుకుంటారు. అయితే సాధారణంగా ఈ పెన్షన్ స్కీమ్స్ అన్నీ కూడా యాభై అరవై ఏళ్ల నుండే వస్తూ ఉంటాయి. కానీ కాస్త తక్కువ వయస్సు నుండి మొదలైతే బాగుండు అనుకునే వాళ్ళ కోసమే ఈ LIC ఇటీవల తీసుకొచ్చిన ఓ పెన్షన్ పాలసీ తీసుకుంటే మీరు 40 ఏళ్ల వయస్సు నుంచే పెన్షన్ పొందొచ్చు. ఆ పాలసీ పేరు ఎల్ఐసీ సరళ్ పెన్షన్. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..

lic

ఈ పాలసీలో రెండు యాన్యుటీ ఆప్షన్స్ వున్నాయి. మొదటిది యాన్యుటెంట్ జీవించి ఉన్నంతకాలం పెన్షన్ వస్తుంది. యాన్యుటెంట్ మరణించిన రాదు. పాలసీ కొనడానికి చెల్లించిన డబ్బులు 100 శాతం నామినీకి వస్తాయి. అదే రెండవది యాన్యుటెంట్, వారి జీవితభాగస్వామి బతికి ఉన్నన్ని రోజులు పెన్షన్ వస్తుంది. ఇద్దరూ మరణించిన తర్వాత పాలసీ డబ్బులు మొత్తం నామినీకి వస్తాయి. ఈ పాలసీ తీసుకోవాలంటే కనీస వయస్సు 40 ఏళ్లు పూర్తి కావాలి.

గరిష్ట వయస్సు 80 ఏళ్లు పూర్తి కావాలి. ఈ పాలసీ తీసుకుంటే కనీసం నెలకు రూ.1,000, మూడు నెలలకు రూ.3,000, ఆరు నెలలకు రూ.6,000, ఏడాదికి రూ.12,000 పెన్షన్ పొందొచ్చు. పాలసీ తీసుకున్నప్పుడు చెల్లించిన మొత్తంపై పెన్షన్ ఆధార పడివుంది. 60 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి రూ.10,00,000 చెల్లించి ఈ పాలసీ తీసుకుంటే ఏడాదికి రూ.51,650 చొప్పున పెన్షన్ వస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news