LIC : అదిరే పాలసీ.. రూ.233తోనే రూ.17 లక్షలు..!

-

ఎలైసి ఎన్నో రకాల పాలసీలని అందిస్తోంది. వీటి వలన కస్టమర్స్ కి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. పైగా ఇందులో డబ్బులు పెట్టడం వలన ఎలాంటి రిస్క్ ఉండదు. పైగా సేఫ్ కూడా. అయితే లైఫ్ ఇన్సూరెన్స్ అందిస్తున్న పాలసీల్లో ఎల్ఐసీ జీవన్ లాభ్ ప్లాన్ కూడా ఒకటి. ఇది చక్కటి ప్రయోజనాలని ఇస్తుంది.

LIC

అలానే ఎన్నో లాభాలని మనం ఈ ప్లాన్ తో పొందొచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. ఎల్‌ఐసీ జీవన్ లాభ్ ప్లాన్ ద్వారా ప్రతి రోజూ మీరు రూ.233 ఇన్వెస్ట్ చేసి, రూ.17 లక్షల కార్పస్ పొందవచ్చు. అందర్నీ దృష్టి లో ఉంచి ఈ ప్లాన్ ని తీసుకు రావడం జరిగింది. ఇందులో డబ్బు పెడితే లక్షాధికారి అయిపోవచ్చు కూడా. అయితే ఈ పాలసీ అనేది నాన్ లింక్డ్ పాలసీ. దీనికీ షేర్ మార్కెట్ కి లింక్ లేదు.

ఇది లిమిటెడ్ ప్రీమియం ప్లాన్. ఈ ప్లాన్ లో డబ్బులు పెడితే పిల్లల చదువులకు, పెళ్లికి, ప్రాపర్టీ కొనుగోలుకు బాగుంటుంది. 8 నుంచి 59 ఏళ్ల మధ్య వయసున్న వారు ఈ పాలసీ కి అర్హులు. ఎవరైనా ఈ పాలసీని తీసుకోవచ్చు. ఇది ఇలా ఉంటే పాలసీ వ్యవధి వచ్చేసి 16 నుంచి 25 ఏళ్ల మధ్యలో ఉంటుంది. ఎంతైనా ఇందులో పెట్టచ్చు.

కనీసం రూ.2 లక్షల మొత్తానికి పాలసీ తీసుకోవాలి. మూడేళ్లు ప్రీమియం చెల్లించిన తర్వాత రుణ సౌకర్యం ఉంటుంది. పన్ను మినహాయింపు కూడా ఉంటుంది. ఇక ఎలా డబ్బులు వస్తాయి అనేది చూస్తే.. 20 ఏళ్ల వయసులో ఉన్న వారు 16 ఏళ్ల టర్మ్‌తో రూ.10 లక్షల బీమా మొత్తానికి పాలసీ తీసుకుంటే వారు నెలకు రూ.7 వేల వరకు ప్రీమియం చెల్లించాల్సి వస్తుంది. రూ.233 ఆదా చేస్తే చాలు. పదేళ్లు ప్రీమియం కడితే 39 ఏళ్లప్పుడు చేతికి రూ.17 లక్షలకు పైగా పొందొచ్చు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version