Aadhar: మీ ఆధార్ ని ఎవరైనా వాడారని అనుమానమా..? అయితే ఇలా చెక్ చెయ్యండి..!

-

మనకు ఉండే ముఖ్యమైన డాక్యుమెంట్స్ లో ఆధార్ కార్డు ఒకటి. ఆధార్ వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ప్రతి దానికి కూడా అవసరం. ప్రస్తుతం భారతీయుల జీవితంలో ఆధార్ అత్యంత కీలకమైన డాక్యుమెంట్. ప్రభుత్వ పథకాలు పొందేందుకు బ్యాంకు లావాదేలు సహా ఏ పనికైనా సరే ఆధార్ కార్డు కావాలి. ఇందులో 12 అంకెల ప్రత్యేక గుర్తింపు నెంబర్ కీలకంగా ఉంటుంది.

ఆధార్ కార్డులో వ్యక్తిగత వివరాలుతో పాటుగా బయోమెట్రిక్ వివరాలు కూడా ఉంటాయి. అయితే ముఖ్యమైన ఈ ఆధార్ కార్డును జాగ్రత్తగా వినియోగించుకోవాలి. కొంత మంది మోసగాళ్లు ఆధార్ ని దుర్వినియోగం చేస్తున్నారు. మీ ఆధార్ కార్డు ని కూడా ఇలా చేస్తే చిక్కుల్లో పడాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి కూడా కలుగుతుంది. ఆధార్ అథెంటికేషన్ హిస్టరీ ప్రాసెస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

  • దీనికోసం ముందు మీరు UIDAI అధికారిక పోర్టల్ లోకి వెళ్లాలి.
  • స్క్రీన్ పై కనిపించే మై ఆధార ఆప్షన్ లోకి వెళ్లి సర్వీస్ పై నొక్కండి.
  • తర్వాత అథెంటికేషన్ హిస్టరీ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. వివరాలను ఎంటర్ చేసి స్క్రీన్ కిందకి స్క్రోల్ చేస్తే అథెంటికేషన్ హిస్టరీ ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేయాలి. అక్కడ ఆల్ అని ఎంపిక చేసుకుని ఫెచ్ అథెండికేషన్ హిస్టరీ పై క్లిక్ చేయండి.
  • ఇప్పుడు 6 నెలలుగా మీ ఆధార్ ఎక్కడెక్కడ ఉపయోగించారు అనే వివరాలు కనబడతాయి ఒకవేళ దుర్వినియోగం జరిగినట్లయితే ఫిర్యాదు చేయాలి.
  • అందుకోసం 1947 కి కాల్ చేయాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version