ట్రైన్ టిక్కెట్ బుకింగ్‌కు పేటీఎంలో కొత్త ఫీచర్.. ఇలా బుక్‌ చెస్తే టికెట్‌ కన్ఫామ్‌

-

పేటీఎం రైలు టిక్కెట్ బుకింగ్‌ల కోసం ‘గ్యారంటీడ్ సీట్ అసిస్టెన్స్’ అనే కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ యూజర్లు ధృవీకరించిన సీటును పొందే అవకాశాలను పెంచుకోవడానికి మల్టీ రైలు ఆప్షన్లను ఎంచుకోవడానికి అనుమతిస్తుంది.

పేటీఎంలో ట్రైన్ బుక్ చేస్తున్నారా? పండుగ సీజన్‌లో రైలు టిక్కెట్లను పొందేందుకు ఆరాటపడుతుంటారు. గరిష్ట ప్రయాణ తేదీల కోసం ఇప్పటికే వెయిటింగ్ లిస్ట్‌లు ఉన్నాయి. దాంతో వినియోగదారులకు సాయం చేసేందుకు పేటీఎం రైలు టిక్కెట్ బుకింగ్‌ల కోసం ‘గ్యారంటీడ్ సీట్ అసిస్టెన్స్’ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్‌ ఏంటి, దీని వల్ల ప్రయోజనం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు రైలు టిక్కెట్‌ను బుక్ చేసుకునేటప్పుడు ధృవీకరించిన సీటును పొందవచ్చు. వినియోగదారులు వారి ప్రాధాన్య రైళ్లలో ధృవీకరించిన బుకింగ్‌ను నిర్ధారించడానికి మల్టీ రైలు ఆప్షన్లను అందిస్తుంది. అదనంగా, ఈ ఫీచర్ ప్రయాణికులకు, ముఖ్యంగా పండుగ సమయాల్లో, టిక్కెట్ లభ్యత, లాంగ్ వెయిట్‌లిస్ట్‌లకు సంబంధించిన ఆందోళనలను కూడా తగ్గిస్తుంది. పేటీఎం ప్రకారం ఈ ఫీచర్ సమీపంలోని వివిధ బోర్డింగ్ స్టేషన్‌ల నుంచి ప్రత్యామ్నాయ రైలు బుకింగ్ ఆప్షన్లను సిఫార్సు చేస్తోంది. తద్వారా ధృవీకరించిన టిక్కెట్‌ను పొందే అవకాశాలను పెంచుతుంది.

పేటీఎంలో కన్ఫర్మడ్ టిక్కెట్‌ను ఎలా ఉపయోగించాలంటే?

  • పేటీఎం యాప్‌ని ఓపెన్ చేయండి.
  •  మీ ప్రయాణ గమ్యస్థానానికి వెళ్లే రైళ్ల కోసం సెర్చ్ చేయండి.
  •  ఎంచుకున్న రైలు టిక్కెట్ వెయిట్‌లిస్ట్‌లో ఉంటే.. మీరు ‘ప్రత్యామ్నాయ స్టేషన్’ ఆప్షన్ ఎంచుకోవచ్చు.
  • సమీపంలోని ప్రత్యామ్నాయ స్టేషన్ల నుంచి అందుబాటులో ఉన్న టిక్కెట్ ఆప్షన్లను ఎంచుకోండి.
  •  మీరు ఇష్టపడే బోర్డింగ్ స్టేషన్ నుంచి మీ ప్రయాణ గమ్యస్థానానికి టిక్కెట్‌లను ఎంచుకుని, బుక్ చేసుకోండి.

యూపీఐతో రైలు టికెట్ బుకింగ్ పేమెంట్

రైలు టిక్కెట్ బుకింగ్‌ల కోసం వినియోగదారులు ఎలాంటి పేమెంట్ గేట్‌వే రుసుము చెల్లించకుండా యూపీఐతో చెల్లించవచ్చని పేటీఎం పేర్కొంది. అదనంగా, యూజర్లు పేటీఎం యాప్‌లో లైవ్ రైలు రన్నింగ్ స్టేటస్, PNR స్టేటస్ చెక్ చేయవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version