ఇక నుండి ఈ సర్వీసుల కోసం ఆర్టీవో ఆఫీస్ కి వెళ్ళక్కర్లేదు…!

-

మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ హైవే (ఎంఓఆర్టిహెచ్) డ్రైవింగ్ లైసెన్స్ మరియు రిజిస్ట్రేషన్ కోసం కొన్ని ఆన్లైన్ పద్ధతుల్ని వివరించడం జరిగింది. గురువారం మార్చి 4న ఈ పద్దెనిమిది సర్వీసుల కోసం చెప్పడం జరిగింది. ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్, వెహికల్ రిజిస్ట్రేషన్ మొదలైన వాటిని ఇంట్లో నుండే చేసుకోవచ్చు. సమీపంలో ఉన్న ఆర్ టి ఓ ఆఫీస్ కి వెళ్లక్కర్లేదు.

ట్విట్టర్ ద్వారా ఈ విషయాలన్నీ షేర్ చేయడం జరిగింది. ఈ సర్వీసులు వల్ల ప్రజలు ఎటువంటి ఇబ్బంది పడకుండా సర్వీసులు ఇంట్లో నుంచి చేసుకోవడం మరింత సులువు. డ్రైవింగ్ లైసెన్స్ మరియు ఆర్సి ని ఆధార్ తో లింక్ చేసుకోమని యూనియన్ గవర్నమెంట్ చెప్పిన తర్వాత ఈ నోటిఫికేషన్ వచ్చింది. ఈ 18 సర్వీసుల్ని నోటిఫికేషన్ ద్వారా తెలియజేశారు.

1. లైసెన్స్ను ఇక నుండి ఆన్ లైన్ లో పొందవచ్చు.
2. డూప్లికేట్ డ్రైవింగ్ లైసెన్స్.
3. డ్రైవింగ్ లైసెన్స్ పునరుద్ధరణ కోసం పరీక్ష అవసరం లేదు.
4. డ్రైవింగ్ లైసెన్స్ లో అడ్రస్ మార్చుకోవడం మరియు సర్టిఫికెట్ రిజిస్ట్రేషన్.
5. ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ ఇష్యూ.
6 . మోటార్ వెహికల్ టెంపరరీ రిజిస్ట్రేషన్.
7. మోటార్ వెహికల్ పూర్తిగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం.
8. డూప్లికేట్ సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ కోసం అప్లికేషన్.
9. గ్రాంట్ ఆఫ్ Noc రిజిస్ట్రేషన్ కి అప్లికేషన్.
10. సరెండర్ ఆఫ్ క్లాస్ ఆఫ్ వెహికల్ ఫ్రొమ్ లైసెన్స్.
11. మోటారు వాహన యాజమాన్యం బదిలీ నోటీసు.
12.మోటారు వాహన యాజమాన్యం బదిలీ కోసం దరఖాస్తు.
13. రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లో చిరునామా మార్చడానికి సమాచారం.
14.గుర్తింపు పొందిన డ్రైవర్ శిక్షణా కేంద్రం నుండి డ్రైవర్ శిక్షణ కోసం రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు.
15. డిప్లొమాటిక్ ఆఫీసర్ యొక్క మోటారు వాహనాల రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు.
16 .డిప్లొమాటిక్ ఆఫీసర్ యొక్క మోటారు వాహనం యొక్క తాజా రిజిస్ట్రేషన్ మార్క్ కేటాయించడానికి దరఖాస్తు.
17 ఎండార్స్మెంట్ ఆఫ్ హైర్-పర్చేస్ అగ్రిమెంట్.
18. టెర్మినేషన్ ఆఫ్ హైర్-పర్చేస్ అగ్రిమెంట్.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version