పీఎఫ్ కొత్త రూల్స్: ఈ రూల్స్ పాటించకపోతే ఈపీఎఫ్ డబ్బులు రావు..!

-

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ) పిఎఫ్ బెనిఫిట్స్ పొందడానికి ఆధార్ కార్డును పిఎఫ్ యుఎన్ (యూనివర్సల్ అకౌంట్ నంబర్) తో లింక్ తప్పనిసరి చేసింది. ఈ గడువును 2021 జూన్ 1 నుండి 2021 సెప్టెంబర్ 1 వరకు పోస్టుపోన్ చేయడం జరిగింది.

ఇపిఎఫ్ఓ/ EPFO

ఈ కొత్త నిబంధనను అమలు చేయడానికి కార్మిక మంత్రిత్వ శాఖ సామాజిక భద్రత 2020 కోడ్ 142 సెక్షన్‌ను సవరించింది. పాన్ మరియు ఆధార్ కార్డ్ లింక్ అన్ని బ్యాంకులు, పిపిఎఫ్ ఖాతాలు మరియు ఇపిఎఫ్ ఖాతాల యొక్క ప్రాథమిక నో యువర్ కస్టమర్ (కెవైసి) అవసరం.

దీనిని కనుక చేయకపోతే, యజమానుల పీఎఫ్ ఎకౌంట్ లో సమస్యలు వస్తాయని తెలిపారు. ఇది ప్రాథమిక అమలు చర్య అని ఎంవి కిని భాగస్వామి విడిషా క్రిషన్ అన్నారు. అయితే మారిన రూల్స్ ప్రకారం మినిస్టరీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయిమెంట్ జూన్ 3న ఆధార్ కార్డు నెంబర్ ని తప్పకుండా లింక్ చేయాలి అని చెప్పడం జరిగింది.

రిజిస్ట్రేషన్ ఎవరైతే చేయించుకోవాలి అనుకుంటున్నారో వారు తప్పనిసరిగా ఆధార్ కార్డు నెంబర్ ఇవ్వాలని అన్నారు. ఇలా చేయడం వల్ల స్కీమ్స్ ద్వారా డబ్బులు కూడా పొందవచ్చని చెప్పారు. ఆధార్ ధృవీకరించిన యుఎఎన్‌లతో ఇసిఆర్ దాఖలు చేసే తేదీని కూడా సెప్టెంబర్ 1, 2021 వరకు పొడిగించినట్లు ఇపిఎఫ్‌ఒ నోటిఫికేషన్‌లో తెలిపింది.

మీ ఆధార్ వివరాలు అప్డేట్ చెయ్యకపోతే మీరు ఇతర ఇపిఎఫ్ ప్రయోజనాలను కూడా కోల్పోతారు. గత నెలలో ప్రకటించిన COVID-19 అడ్వాన్స్ మరియు పిఎఫ్ ఖాతాలకు అనుసంధానించబడిన బీమా ప్రయోజనాలు ఇందులో ఉన్నాయి. అలానే పాన్ ఆధార్ లింక్ కూడా ముఖ్యం.

యుఎఎన్‌తో ఆధార్‌ను లింక్ చేయడం తప్పనిసరి.ఇది  ఇలా ఉంటే 1 సెప్టెంబర్ 2021 నుండి
లింక్ చెయ్యకపోతే పిఎఫ్‌ను పంపించలేరు అని డెలాయిట్ ఇండియా భాగస్వామి సరస్వతి కస్తూరిరంగన్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version