పీఎం యూఎస్‌పీ స్కాలర్‌షిప్‌కి ఏడాదికి రూ.20,000 ఇస్తారు.. పూర్తి వివరాలు మీ కోసం ..

-

ప్రధానమంత్రి ఉచ్చతర్‌ శిక్షా ప్రోత్సాహన్‌ యోజన అనేది భారత ప్రభుత్వం యొక్క ఉన్నత విద్యా విభాగం, విద్యా మంత్రిత్వ శాఖ ద్వారా అమలు చేయబడుతున్న కేంద్ర ప్రభుత్వ పథకం. ఈ పథకం ఆర్థికంగా వెనుకబడినటువంటి మెరిట్ స్టూడెంట్స్ కు ఉన్నత విద్యను కొనసాగించాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టారు. ఈ యోజన పథకం ద్వారా విద్యార్థులు గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి రంగాల లో చదువుకోవడానికి స్కాలర్షిప్ ను అందిస్తుంది. PM-USP యోజన యొక్క అర్హతలు, ప్రయోజనాలు, దరఖాస్తు, విధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం..

పీఎం ఉచ్చతర్‌ శిక్షా ప్రోత్సాహన్‌ యోజన యొక్క ప్రధాన ఉద్దేశం ఆర్థికంగా వెనుకబడినటువంటి మెరిట్ విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలు అందించడం కోసం అందించనున్నారు. ఈ పథకం విద్యార్థుల రోజువారి ఖర్చులను భరించడానికి ఆర్థిక సహాయాన్ని అందించడం. కాలేజీలలో విద్యా విధానం లో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను ప్రోత్సహించడం. ఇంజనీరింగ్, మెడిసిన్ కోర్సులు చదువుకునే విద్యార్థులకు కొంత ఆర్థిక మద్దతుని ఇవ్వడం ముఖ్య ఉద్దేశంగా పరిగణించబడుతుంది.

PM-USP Scholarship Explained – ₹20,000 Grant Per Year for Eligible Students

అర్హత: PM -USP స్కాలర్షిప్ కోసం అర్హత పొందడానికి విద్యార్థులు 18 నుంచి 25 సంవత్సరాల లోపు వారే ఉండాలి. టెన్త్ మరియు ఇంటర్ లో 80 శాతం మార్కులు కలిగి ఉండాలి. వీరి కుటుంబ ఆదాయం 4.5 లక్షల లోపు ఉండాలి. విద్యార్థులు గుర్తింపు పొందిన కాలేజీలు లేదా విశ్వవిద్యాలయాల లో రెగ్యులర్ గ్రాడ్యుయేషన్ లేదా పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సులు చదువుతూ ఉండాలి. ఓపెన్ యూనివర్సిటీలు, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కు సంబంధించిన వారు ఈ పథకానికి అర్హులు కాదు. ఇతర స్కాలర్షిప్ పథకాల నుండి ఆల్రెడీ ప్రయోజనం పొందుతున్న విద్యార్థులు ఈ పథకానికి అర్హులు కాదు.

స్కాలర్షిప్ కింద ఇచ్చేది: ఈ స్కాలర్షిప్ కింద మొత్తం కోర్సును బట్టి సంవత్సరానికి మారుతూ ఉంటాయి. గ్రాడ్యుయేషన్ స్థాయి మొదటి మూడు సంవత్సరాలకు రూ.12,000 పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయి సంవత్సరానికి 20,000 చొప్పున అందించబడుతుంది. ఇక వృత్తిపరమైన కోర్సులు ఐదేళ్లు లేదా ఇంటిగ్రేటెడ్ కోర్సులు చదివే విద్యార్థులకు 4 వ సంవత్సరం 5 వ సంవత్సరానికి రూ.20,000 అందిస్తారు. ఇక బిటెక్, బిఈ వంటి కోర్సులు చేసేవారు మూడు సంవత్సరాలకు రూ.12,000 నాలుగో సంవత్సరానికి రూ.20,000 అందిస్తారు.సంవత్సరానికి గరిష్టంగా 82 వేల కొత్త స్కాలర్షిప్లను దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన కాలేజీలలో చదివే విద్యార్థులకు అందించబడుతుంది.

దరఖాస్తు ప్రక్రియ: ఈ స్కాలర్షిప్ కోసం దరఖాస్తు అక్టోబర్ 31 చివరి తేదీ. పూర్తి వివరాలకు.. ఈ https://scholarships.gov.in వెబ్సైట్ ని విజిట్ చేయండి. కష్టపడి చదువుకోవాలనుకునే విద్యార్థులకు, మెరిట్ స్టూడెంట్ లకు, చదువుని మధ్యలో ఆపకూడదన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ స్కాలర్షిప్ పథకాన్ని ప్రవేశపెట్టింది.

Read more RELATED
Recommended to you

Latest news