రాజా సాబ్ రిలీజ్ తేదీ పై క్లారిటీ..!

-

బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ పుట్టిన రోజు సందర్భంగా రాజా సాబ్ మేకర్స్ ఆయన లుక్ ను రివీల్ చేస్తూ.. స్పెషల్ పోస్టర్ ను పంచుకున్నారు. ఇందులో ముందు ప్రకటించినట్టే డిసెంబర్ 05న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు వెల్లడించారు. దీంతో రాజాసాబ్ వాయిదా పడుతుందనే పుకార్లకు మేకర్స్ క్లారిటీ ఇచ్చినట్టయిందని అభిప్రాయపడుతున్నారు ఫ్యాన్స్. ఈ చిత్రాన్ని మారుతి తెరకెక్కిస్తుండగా తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

raajasab

వాస్తవానికి రాజాసాబ్ మూవీ డిసెంబర్ 05న విడుదలవుతుందని నెల రోజుల కిందటే రూమర్స్ వినిపించాయి. కానీ మేకర్స్ అధికారికంగా ప్రకటించకపోవడంతో రిలీజ్ పై అభిమానులు తర్జన భర్జన పడ్డారు. తాజాగా మేకర్స్ పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించడంతో  ఓ క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నప్పటికీ పోస్టు ప్రొడక్షన్ పనులు.. గ్రాఫిక్స్ ఎక్కువగా ఉండటం వల్ల పనులు లేట్ అవుతున్నట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news