పాత వంద సిరీస్ నోట్లని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. అంటే కొత్త సిరీస్ నోట్లని సర్క్యులేషన్ చేయాలని అనుకుంటోంది. మంగళూరు లోని దక్షిణ కన్నడ జిల్లా పంచాయతీ హాల్ లో జిల్లా స్థాయి బ్యాంకింగ్ సెక్యూరిటీ కమిటీ అండ్ క్యాష్ మేనేజ్మెంట్ కమిటీ సబే లో ఆర్బీఐ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ బిఎన్ మహేష్ మాట్లాడటం జరిగింది. పాత సిరీస్ లో ఉన్న వంద రూపాయలు నోట్లని మార్చి నాటికి పూర్తిగా తీసుకోనున్నారు.
ఇది ఇలా ఉండగా ఆరు సంవత్సరాలుగా వీటిని ముద్రించడం లేదు అని చెప్పారు. అయితే ఆర్బీఐ ఈ నోట్లని అన్నింటినీ పూర్తిగా తీసుకోనున్నది. ఆర్బీఐ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే గతం లో ప్రింట్ చేసిన ఈ నోట్లని అన్నింటినీ తీసుకోవడమే. మార్చి నాటికి వీటన్నిటినీ పూర్తిగా స్వాధీనం చేసుకోనుంది. అయితే ప్రజలు ఆందోళన చెందక్కర్లేదు. ఎందుకంటే కొత్త నోట్లను మాత్రమే ఉంచాలనే ఉద్దేశంతో దీన్ని చేయనున్నారు. ఇలా కొత్త వంద నోట్లు మాత్రమే సర్క్యులేషన్ చేయాలని పాత వాటిని ఇచ్చేయాలని సూచించింది.
అలానే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.10 కాయిన్స్ ని సర్క్యులేట్ అయ్యేలా చేయమని బ్యాంకులని సూచించింది. ఇప్పటికే పది రూపాయలు నాణాలు సర్కులేట్ అవ్వట్లేదు అని వాటిని సర్క్యులేట్ చేయడానికి మార్గాలని కనుక్కోవాలని బ్యాంకులకు చెప్పడం జరిగింది. గతంలో రూ10 కాయిన్స్ నకిలీవి అని పుట్టించారు. దీని వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని అవి నకిలీ కాదని ప్రజలకు చెప్పాలని వెల్లడించారు. ఇది ఇలా ఉంటె దక్షిణ కన్నడలో 92 శాతం ఎటిఎంలు పని చేశాయి. ఇది మంచి విషయం అని బ్యాంకుల్ని ప్రశంసించడం జరిగింది. అన్ని బ్యాంకులు కరెన్సీ చెస్ట్‌తో అనుసంధానించాలి అని అన్నారు. చెస్ట్ బ్యాంక్ ఎక్కువ రూ. వసూలు చెయ్యకూడదని… అలా దొరికితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం జరిగింది.