ఏటీఎంల‌లో న‌గ‌దు తీస్తున్నారా..? అయితే మీకు ఆర్‌బీఐ శుభ‌వార్త..!

డెబిట్‌, క్రెడిట్ కార్డుల‌తో ఏటీఎంల‌లో ఎక్కువ‌గా న‌గ‌దు విత్‌డ్రా చేస్తుంటారా ? అయితే మీకు రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) శుభ‌వార్త చెప్పింది.

డెబిట్‌, క్రెడిట్ కార్డుల‌తో ఏటీఎంల‌లో ఎక్కువ‌గా న‌గ‌దు విత్‌డ్రా చేస్తుంటారా ? అయితే మీకు రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) శుభ‌వార్త చెప్పింది. సాధార‌ణంగా ఎవ‌రైనా స‌రే.. నెల‌కు డెబిట్ కార్డుల‌తో 5 క‌న్నా ఎక్కువ సార్లు ట్రాన్సాక్ష‌న్లు చేయ‌రాదు. కేవ‌లం 5 లావాదేవీలే ఉచితంగా వ‌స్తాయి. ఆ పైన చేసే ట్రాన్సాక్ష‌న్ల‌కు నిర్దిష్ట రుసుం చెల్లించాల్సిందే. అయితే తాజాగా ఈ లావాదేవీల‌కు గాను ఆర్‌బీఐ ప‌లు నిబంధ‌న‌ల‌ను స‌డ‌లించింది. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

rbi simplifies 5 free atm transactions rule

డ‌బ్బుల‌ను విత్‌డ్రా చేసుకునేందుకు కార్డుల స‌హాయంతో య‌త్నించిన‌ప్పుడు మ‌న‌కు ప‌లు సార్లు ప‌లు స‌మ‌స్య‌లు ఎదుర‌వుతుంటాయి. పిన్‌ను త‌ప్పుగా ఎంట‌ర్ చేసిన‌ప్పుడు, ఏటీఎంలో న‌గ‌దు లేక‌పోయినా, ప‌లు సాంకేతిక స‌మ‌స్య‌ల వ‌ల్ల ట్రాన్సాక్ష‌న్లు అప్పుడ‌ప్పుడు ఫెయిల‌వుతుంటాయి. దీంతో మ‌న‌కు డ‌బ్బు రాదు. అయితే ఇలాంటి సంద‌ర్భాల్లో జ‌రిగే లావాదేవీల‌ను అస‌లు లావాదేవీల కింద లెక్కించ‌రు. అంటే వినియోగ‌దారులకు నెల‌వారీగా ఉండే 5 ఉచిత లావాదేవీలు అలాగే ఉంటాయి. ఈ సంద‌ర్భాల్లో జ‌రిపిన లావాదేవీలు ఫెయిలైతే వాటిని లెక్కించ‌ర‌న్న‌మాట‌. దీంతో ఆ 5 లావాదేవీలు అలాగే ఉంటాయి. మ‌నం కార్డుతో డ‌బ్బు తీసుకునే లావాదేవీల‌నే అసలైన లావాదేవీలుగా లెక్కిస్తారు. ఫెయిలైన వాటిని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోరు. దీని వ‌ల్ల వినియోగ‌దారుల‌కు ఎంతో ఉప‌యోగం ఉంటుంది.

ఇక కేవ‌లం పై సంద‌ర్భాల్లో మాత్ర‌మే కాకుండా బ్యాలెన్స్ ఎంక్వ‌యిరీ, చెక్ బుక్ రిక్వెస్ట్‌, ట్యాక్స్ పేమెంట్‌, ఫండ్స్ ట్రాన్స్‌ఫ‌ర్ వంటి లావాదేవీల‌ను ఏటీఎంల‌లో నిర్వ‌హించినా వాటిని కూడా అస‌లు లావాదేవీల కింద లెక్కించ‌రు. కేవ‌లం న‌గ‌దును విజ‌య‌వంతంగా తీసుకుంటేనే ఆ లావాదేవీల‌ను లెక్కిస్తారు. అవే లావాదేవీలు 5 ఉచిత లావాదేవీల్లోంచి మైన‌స్ అవుతాయి. దీంతో బ్యాంక్ ఖాతాదారుల‌కు ఎంత‌గానో ప్ర‌యోజ‌నం క‌లుగుతుంద‌ని ఆర్‌బీఐ చెబుతోంది. క‌నుక ఇక‌పై ఏటీఎంలో డ‌బ్బు రాకుండా ఏ కార‌ణం చేత‌నైనా ట్రాన్సాక్ష‌న్ ఫెయిలైతే అన‌వ‌స‌రంగా ఒక ట్రాన్సాక్ష‌న్ క‌ట్ అయింద‌ని చింతించ‌కండి.. ఆ ట్రాన్సాక్ష‌న్ అలాగే ఉంటుంది..!