Jan Dhan : గుడ్‌ న్యూస్.. 3 కోట్ల మందికి ఆ స్కీమ్.. ఒక్కొక్కరికీ రూ. 2 లక్షలు..!

-

Jan Dhan: కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 2014 ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవాన్ని నాడు యోజనకు శ్రీకారం చుట్టింది. ప్రధాన నరేంద్ర మోడీ ఈ పథకాన్ని ప్రారంభించారు. బ్యాంకు సేవలు అందనివారికి, వెనుకబడిన వర్గాలకి బీమా పెన్షన్ సదుపాయాలని కల్పించాలని లోన్ సేవలు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా ఈ ఖాతాలని తీసుకురావడం జరిగింది. ఇది వచ్చి పదేళ్లు పూర్తవుతోంది. పదవ వార్షికోత్సవం సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రధానమంత్రి జన్ ధన్ యోజన కింద కొత్తగా మూడు కోట్లు అకౌంట్స్ తెరిచే అవకాశం ఉందని వెల్లడించారు.

2015 మార్చిలో 14.72 అకౌంట్స్ ఉండగా అది 2024 ఆగస్టు 16 నాటికి 53.13 కోట్లకు చేరుకున్నట్లు తెలుస్తోంది. అకౌంట్లో మినిమం బాలన్స్ లేకపోయినా చార్జీలు కట్ అవ్వవు. ఈ ఖాతాల ద్వారా రెండు లక్షల ప్రమాద బీమా ఉంటుంది. ఉచిత రూపే కార్డును కూడా ఇస్తారు. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం 2024-25 లో మూడు కోట్లకు పైగా అకౌంట్స్ తెరవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

దేశంలోని పేదవారు అందరూ బ్యాంక్ అకౌంట్స్ తీసుకున్నారని విశ్వసిస్తున్నామని ఆమె అన్నారు. ఈ స్కీము కింద ఓపెన్ చేసిన అకౌంట్స్ లో 66.6% గ్రామీణ చిన్న పట్టణాల్లోని ప్రజలకు చెందినవి ఉన్నాయి. మొత్తం 53.13 కోట్ల అకౌంట్స్ లో 29.56 కోట్ల ఖాతాలు మహిళలవి ఉన్నాయి. ఈ కేవైసీ, వీడియో కేవైసీ వంటివి అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ పేపర్ లెస్ గా మారుస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version