ప్రతి ఒక్కరికి కూడా డబ్బు చాలా అవసరం. భవిష్యత్తులో ఏ ఇబ్బంది ఉండకూడదు అంటే ముందు నుంచే పొదుపు చేసుకోవాలి. అప్పుడే భవిష్యత్తులో సమస్యలు ఉండవు. 60 ఏళ్ళు దాటిన తర్వాత పని చేసి డబ్బు సంపాదించలేని పరిస్థితిలో కూడా ఆదాయం వచ్చేలా ప్లాన్ చేసుకోవాలి. ఇది చాలా ముఖ్యం. పదవి విరమణ తర్వాత నెలవారి ఆదాయం పొందడం అంత ఈజీ కాదు. కనుక వాళ్ళందరికీ మేలు కలిగేలా ప్రభుత్వం ఒక పథకాన్ని తీసుకువచ్చింది. అదే సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీం.
ఐదేళ్ల మెచ్యూరిటీ ఉండే ఈ స్కీం రిటైర్మెంట్ తర్వాత స్థిరమైన ఆదాయాన్ని పొందే విధంగా సహాయపడుతుంది. రిటైర్మెంట్ ప్లానింగ్ కి పరిష్కారాన్ని అందించే కేంద్ర ప్రభుత్వం నిర్వహించబడుతున్న చిన్న పొదుపు పథకం ఇది. ఈ పథకంలో ఇన్వెస్ట్ చేయడం వలన సీనియర్ సిటిజెన్స్ నెల నెలా 20వేల వరకు పొందగలుగుతారు. 8.2 శాతం వడ్డీని అందిస్తోంది. 60 ఏళ్లు పైబడిన భారతీయ పౌరులు ఎవరైనా ఈ స్కీంలో చేరడానికి అవుతుంది.
ఈ పథకంలో గరిష్ట పెట్టుబడి 30 లక్షలు. గతంలో ఇది 15 లక్షలుగా ఉంది. సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్స్ కింద 30 లక్షల పెట్టుబడి పెడితే ప్రతి ఏడాది దాదాపు 2,46,000 వడ్డీ వస్తుంది. ఈ మొత్తాన్ని నెలవారీ ప్రాతిపదికన లెక్కిస్తే 20,500 వస్తుంది. స్వచ్ఛంద పదవీ విరమణ పొందితే 55 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు ఉన్నవాళ్లు ఈ ఖాతాను తెరవడానికి అవుతుంది. ఈ పథకంలో చేరాలనుకుంటే దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ కి వెళ్లి అకౌంట్ ఓపెన్ చేయొచ్చు.