మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ స్కీం కి అప్లై చేయాలా? అర్హత వివరాలు, దరఖాస్తు విధానం తెలుసుకోండి..!

-

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల ద్వారా ఎంతోమంది ఎన్నో ప్రయోజనాలను పొందుతున్నారు. ముఖ్యంగా మహిళల అభివృద్ధి కోసం భారతదేశ కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. కేవలం అభివృద్ధి కార్యక్రమాలు మాత్రమే కాకుండా రుణాన్ని కూడా అందజేస్తున్నారు. ఈ విధంగా మహిళలకు పెట్టుబడి కూడా అందుతోంది. దానితో వ్యాపారాలను కూడా చేస్తున్నారు. అటువంటి పథకాలలో భాగంగా మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ స్కీమ్ అనే పథకాన్ని 2023 లో ప్రారంభించడం జరిగింది. నరేంద్ర మోడీ ప్రభుత్వంలో ప్రారంభించిన ఈ పథకాన్ని అతి తక్కువ సమయంలో ఎంతోమంది ఉపయోగించుకున్నారు.

 

ప్రజల ఆదరణ పొందడంతో ఈ పథకం ద్వారా పెట్టుబడులను అందిస్తున్నారు మరియు ఎన్నో ప్రయోజనాలను పొందుతున్నారు. అయితే ఈ పథకంలో భాగంగా రెండు సంవత్సరాలు పాటుగా కొంత పెట్టుబడి మహిళలు పెట్టాల్సి వస్తుంది. మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ స్కీమ్ లో పెట్టుబడి పెట్టిన డబ్బు పై 7.5% వడ్డీని పొందవచ్చు. అందుకే మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ స్కీమ్ అనేది ఒక పొదుపు పథకం లాంటిది అని చెప్పవచ్చు. అయితే దీనిలో పెట్టుబడి రెండు లక్షల వరకు చేయవచ్చు.

అర్హత వివరాలు:

భారతదేశంలో నివసించే మహిళా పౌరులు అందరూ ఈ పథకానికి అర్హులు. పైగా 10 సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువ వయసు ఉన్న ఆడపిల్లలు గార్డియన్ తో పాటుగా పథకానికి సంబంధించిన ఖాతా తెరవచ్చు మరియు పెట్టుబడులు చేయవచ్చు.

అప్లై చేసే విధానం:

మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే కేవలం పోస్ట్ ఆఫీస్ లో పొదుపు ఖాతాను తెరవాలి. దీనికోసం అప్లికేషన్ పూరించాలి మరియు దరఖాస్తు లో అడిగిన వివరాలను పూరించిన తర్వాత దానితో పాటుగా ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, పాన్ కార్డు, అడ్రస్ ధ్రువీకరణ పత్రం, వంటి మొదలైన పత్రాలను అందజేయాలి. ఈ విధంగా మహిళా సమాన సేవింగ్ సర్టిఫికెట్ స్కీమ్ ఖాతా తెరిచిన తర్వాత చేసిన పెట్టుబడులు ప్రకారం వడ్డీను పొందవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news