ప్రధానమంత్రి ముద్రా యోజన స్కీం కి అప్లై చేయాలా? అర్హత వివరాలు, దరఖాస్తు విధానం తెలుసుకోండి..!

-

చాలా శాతం మందికి వ్యాపారం ప్రారంభించాలని కోరుకుంటారు. కాకపోతే సరైన ఆర్థిక సహాయం లేకపోవడం, బ్యాంక్ లోన్ రిజెక్ట్ అవ్వడం లేక ఇతర కారణాల వలన ప్రారంభించలేరు. అయితే మీ వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే కేంద్రం ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని ఉపయోగించి వ్యాపారాన్ని ప్రారంభించండి. ముఖ్యంగా సూక్ష్మ, చిన్న పరిశ్రమ వ్యాపారాలను ప్రోత్సహించడానికి మరియు ఆర్థిక సహాయాన్ని ఈ పథకం ద్వారా ప్రభుత్వం అందజేస్తుంది. అదే ప్రధానమంత్రి ముద్రా యోజన. దీనిలో భాగంగా ఎటువంటి హామీ లేకుండా 20 లక్షల వరకు రుణాన్ని పొందవచ్చు.

అర్హత వివరాలు:

18 ఏళ్లు పూర్తి అయిన భారత పౌరులు అందరూ ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. పట్టణ లేక గ్రామీణ ప్రాంతాలలో ఎక్కడైనా వ్యాపారాలను ప్రారంభించవచ్చు.

దరఖాస్తు చేసుకునే విధానం:

ప్రధానమంత్రి ముద్రా యోజన పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు అధికారిక వెబ్సైట్ లోకి వెళ్లి అప్లై పైన క్లిక్ చేయాలి. ఈ ప్రక్రియ లో భాగంగా అడిగిన వివరాలను ఎంటర్ చేశాక ఓటిపి వస్తుంది. దీనిని తిరిగి ఎంటర్ చేసిన తర్వాత వ్యక్తిగత వివరాలు, వ్యాపార వివరాలు వంటివి అందజేయాలి. దీని తర్వాత దరఖాస్తు చేసేందుకు అప్లికేషన్ సెంటర్ ను ఎంపిక చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియలో భాగంగా బ్యాంక్ వివరాలు, రుణ వివరాలు మరియు ఇతర సమాచారాన్ని డాక్యుమెంట్లను అప్లోడ్ చేసి అప్లికేషన్ ను సబ్మిట్ చేయాలి.

ఈ పథకం ద్వారా ప్రయోజనాలను పొందడానికి సొంత వ్యాపారం లేక భాగస్వామ్యంతో అయినా వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ముఖ్యంగా చిన్న చిన్న వ్యాపారాలను చేసేవారు, పండ్లు లేక కూరగాయల విక్రేతలు మరియు ఇతర వ్యవసాయ రంగానికి సంబంధించిన వ్యాపారస్తులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. పైగా తక్కువ వడ్డీ రేట్లు ఉండడం వలన తిరిగి రుణాన్ని సులభంగా చెల్లించవచ్చు. ఈ విధంగా వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news