ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ ఉందా..? ఈపీఎఫ్ఓ అందించే బెనిఫిట్స్‌లో ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్స్యూరెన్స్-EDLI స్కీమ్ గురించి తప్పక తెలుసుకోవాలి. ఇక దాని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. ఈ స్కీమ్ ద్వారా ఉద్యోగులు కుటుంబానికి రూ.7,00,000 బెనిఫిట్ వస్తుంది.
అయితే ఇది ఇన్స్యూరెన్స్ స్కీమ్. ఈపీఎఫ్ అకౌంట్ ఉన్న ఉద్యోగులు అందరూ ఈ స్కీమ్ లో కవర్ అవుతారు. ఈ స్కీమ్ ద్వారా ఉద్యోగులకు రూ.7,00,000 బీమా వర్తిస్తుంది. ఒకవేళ కనుక ఈపీఎఫ్ అకౌంట్ కొనసాగిస్తున్న సమయంలో మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు రూ.7,00,000 బీమా వస్తుంది. అయితే రూ.7,00,000 వరకు బీమా పొందాలంటే ఉద్యోగులు ఇ-నామినేషన్ ఫైల్ చేయాల్సి ఉంటుంది గమనించండి. ఇక ఎలా ఫైల్ చెయ్యాలి అనేది చూస్తే..
ముందుగా ఈపీఎఫ్ఓ పోర్టల్ ఓపెన్ చేసి Services పైన క్లిక్ చేయాలి.
దానిలో For Employees సెక్షన్ క్లిక్ చేయాలి. Member UAN/Online Service ఆప్షన్ ఓపెన్ అవుతుంది.
ఇక్కడ ఉద్యోగులు యూఏఎన్, పాస్‌వర్డ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత Manage ట్యాబ్ క్లిక్ చేయాలి.
E-Nomination సెలెక్ట్ చేసి వివరాలని ఎంటర్ చెయ్యాలి.
Add Family Details క్లిక్ చేసి పేర్లు, ఇతర వివరాలు ఎంటర్ చేయాలి. (ఒకరు లేదా ఒకరి కన్నా ఎక్కువమంది పేర్లు ఎంటర్ చేయొచ్చు).
ఫైనల్ గా Save EPF Nomination పైన క్లిక్ చేయాలి. తర్వాతి పేజీలో E-sign ఆప్షన్ క్లిక్ చేయాలి. వన్ టైమ్ పాస్‌వర్డ్ జనరేట్ అవుతుంది. మీ ఆధార్ కార్డుకు లింక్ అయిన మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి ఇ-నామినేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి