లో దుస్తులపై చట్టాలు..ఎక్కడంటే..?

-

మన దేశంలో లో దుస్తుల పేరు ఎత్తితెనే సిగ్గు పడుతుంటారు. షాపులోకి వెళ్లి గట్టిగా అడిగి కొనాలన్నా సిగ్గే.. అటూ ఇటూ చూసి మెల్లిగా అదిగేస్తారు. అయితే మన దేశం లో లో దుస్తులపై ఎలాంటి చట్టాలు లేవు గానీ కొన్ని దేశాల్లో లో దుస్తులపై కూడా చట్టాలు ఉన్నాయట. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజమే. అంతే కాకుండా ఆ చట్టాలను ఎవరైనా పాటించకపోతే కఠిన శిక్షలు కూడా ఉంటాయట. అవేంటో ఇప్పుడు చూద్దాం.

అమెరికాలోని మిన్నెసోటా లో పురుషులు మరియు మహిళలు ఒకే తీగ పై లో దుస్తులను ఆరబెట్టుకోవాడం నేరమట. అదేవిధంగా తాయిలాండ్ లో అండర్ వేర్ వేసుకోకుండా బయటకు రాకూడదు. స్పానిష్ లోని సేవిల్లే నగరం లో అండర్ వేర్ లు భయట ఉతకడం..ఆరవేయడం కూడా చట్ట విరుద్ధం. అలాగే జపాన్ దేశంలో మహిళలు కచ్చితంగా లో దుస్తులు ధరించాలి. ఇక మనదేశం లో ఎలాంటి చట్టాలు లేకపోయినా ఈ రూల్స్ అందరూ పాటిస్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version