ఈ పథకంలో 5 లక్షల పెట్టుబడితో 15 లక్షలు పొందండి..

-

పోస్ట్ ఆఫీసు పథకాలు చాలా సురక్షితంగా ఉంటాయి.ఎందుకంటే అవి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటాయి కాబట్టి చాలా సురక్షితం. అందులోని పోస్ట్ ఆఫీస్ టర్మ్ డిపాజిట్ స్కీమ్ అనేది చాలా ప్రయజనకరంగా ఉంటుంది. ఈ స్కీంని పోస్ట్ ఆఫీస్ ఎఫ్డీ అని కూడా పిలుస్తారు. ఈ పథకం బ్యాంకులో ఐదేళ్ల ఎఫ్డీ కంటే మెరుగైన వడ్డీ రేటును అందిస్తోంది. మీరు ఈ పథకం ద్వారా ఏకంగా మీరు మూడు రెట్ల ఆదాయాన్ని ఆర్జించవచ్చు. అంటే మీరు ఇందులో రూ. 5లక్షలు పెట్టుబడి పెడితే.. ఏకంగా రూ. 15లక్షలు సంపాదించవచ్చు. అదెలాగో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం..

రూ. 5 లక్షలు పెట్టుబడి పెట్టి రూ.15 లక్షలు పొందడానికి మీరు ముందుగా 5 సంవత్సరాల కాల వ్యవధితో పోస్టాఫీసు ఎఫ్డీలో రూ.5,00,000 డబ్బుని పెట్టుబడి పెట్టాలి. పోస్టాఫీసు మొత్తం 5 సంవత్సరాల ఎఫ్డీపై 7.5 శాతం వడ్డీని ఇస్తోంది. ఈ వడ్డీ రేటుతో లెక్కించినట్లయితే, 5 సంవత్సరాల తర్వాత మెచ్యూరిటీ మొత్తం డబ్బు రూ.7,24,974 అవుతుంది. ఇక మీరు ఈ మొత్తాన్ని విత్‌డ్రా చేయకుండా.. తదుపరి 5 సంవత్సరాలకు దాన్ని పెంచుకోవాలి. ఈ విధంగా, 10 సంవత్సరాలలో మీరు 5 లక్షల మొత్తంపై వడ్డీ ద్వారా ఏకంగా రూ. 5,51,175 సంపాదిస్తారు.

అప్పుడు మీ మొత్తం డబ్బు రూ. 10,51,175 అవుతుంది. ఈ డబ్బు రెట్టింపు కంటే ఎక్కువ. కానీ మీరు ఈ డబ్బుని మరో 5 సంవత్సరాలకు కొనసాగించాలి. ఈ విధంగా మీ డబ్బు మొత్తం 15 సంవత్సరాలకు డిపాజిట్ చేయబడుతుంది. 15వ సంవత్సరంలో, మెచ్యూరిటీ సమయంలో, మీరు పెట్టుబడి పెట్టిన డబ్బు రూ. 5 లక్షలపై వడ్డీ ఏకంగా రూ.10,24,149 పొందుతారు. ఈ విధంగా, మీరు పెట్టుబడి పెట్టిన 5 లక్షలు, వడ్డీ రూ.10,24,149 కలిపి మొత్తం రూ.15,24,149 డబ్బుని పొందుతారు. సాధారణంగా టీనేజ్‌లో పిల్లలకు డబ్బు అవసరం బాగా పెరుగుతుంది. అటువంటి పరిస్థితిలో ఉపయోగపడేలా రూ. 15 లక్షలను మీరు ఇందులో సమకూర్చవచ్చు.

ఈ డబ్బు మీ పిల్లల చదువుల కోసం బాగా ఉపయోగపడుతుంది.రూ. 15 లక్షల డబ్బు కావాలంటే మీరు పోస్టాఫీసు ఎఫ్డీని రెండుసార్లు పొడిగించుకోవాలి. ఇందులో మీరు అర్థం చేసుకోవలసిన కొన్ని నియమాలు ఉన్నాయి. పోస్ట్ ఆఫీస్ 1 సంవత్సరం ఎఫ్డీ మెచ్యూరిటీ తేదీ నుంచి 6 నెలలలోపు, 2 సంవత్సరాల ఎఫ్డీ మెచ్యూరిటీ వ్యవధి నుంచి 12 నెలలలోపు.. 3, 5 సంవత్సరాల ఎఫ్డీ పొడిగింపు కోసం, మెచ్యూరిటీ వ్యవధిలో 18 నెలలలోపు పోస్టాఫీసుకు మీరు తెలియజేయాలి. ఇంకా ఇది కాకుండా, మీరు ఈ అకౌంట్ ఓపెన్ చేసే సమయంలో మెచ్యూరిటీ తర్వాత ఖాతా పొడిగింపు కోసం కూడా అభ్యర్థించవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news