గుడ్ న్యూస్.. రూ.50 ఇన్వెస్ట్ చేస్తే చాలు.. రూ.3 కోట్లు మీసొంతం..

-

డబ్బులను పొదుపు చెయ్యడం చిన్నప్పటి నుంచే ఉండాలి.. అప్పుడే భవిష్యత్ లో ఎటువంటి ఇబ్బందులు ఉండవు..ఇన్వెస్ట్‌మెంట్లను ఎంత త్వరగా స్టార్ట్ చేస్తే.. అంత ఎక్కువ బెనిఫిట్ సొంతం చేసుకోవచ్చు. అందుకే పిలల్లో చిన్నప్పటి నుంచే మనీ సేవింగ్స్ గురించి అవగాహన కల్పించాలి… అలా వాళ్ళు చిన్నప్పటి నుంచే సేవ్ చేస్తే మంచి బెనిఫిట్స్ ఉంటాయి..పదో తరగతి లేదంటే ఇంటర్ పాస్ అయిన వారు చిన్న మొత్తంలో పొదుపు చేసుకుంటూ వస్తే.. భారీ మొత్తం పొందొచ్చు. లేదంటే వారి తల్లిదండ్రులు అయినా వారి పేరుపై రోజుకు రూ.50 పొదుపు చేస్తే.. దీర్ఘకాలంలో భారీ మొత్తం సొంతం చేసుకోవచ్చు..

 

రోజుకు రూ. 50 పొదుపు చేస్తే నెలకు రూ. 1500 అవుతుంది. ఈ మొత్తాన్ని నెల చివరిలో ఒకేసారి మ్యూచువల్ ఫండ్స్ సిప్‌లో పెట్టాలి. అప్పుడు దీర్ఘకాలంలో భారీ మొత్తం సొంతం చేసుకోవచ్చు… అలా మెచ్యూరిటీ సమయంలో రూ. 3.32 కోట్లు పొందొచ్చు. 45 ఏళ్ల పాటు సిప్ ఇన్వెస్ట్‌మెంట్లను కొనసాగించాలి. అంటే 60 ఏళ్లు వచ్చే వారు డబ్బులు పెడుతూ రావాలి…

ఇకపోతే ఇంటర్ పరీక్షలు రాసే వారికి 17 నుంచి 19 ఏళ్లు వరకు ఉండొచ్చు. వీళ్లు నెలకు రూ. 1500 పొదుపు చేస్తే.. రోజుకు రూ. 50 చొప్పున చూస్తే.. 40 ఏళ్ల కాలంలో 12 శాతం రాబడి ప్రకారం చూస్తే.. మెచ్యరిటీ సమయంలో రూ. 1.78 కోట్లు రావొచ్చు.. ఇక రిస్క్ తీసుకోవాలని అనుకుంటే మాత్రం మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చెయ్యాలి.. లేదంటే లైట్ వాటి జోలికే వెళ్లకపోతే మంచిదే.. పీపీఎఫ్ వంటి రిస్క్ లేని పథకంలో చేరొచ్చు. పీపీఎఫ్ ఖాతాలో నెలకు రూ. 1500 పెడితే.. 40 ఏళ్ల కాలంలో చేతికి రూ. 39 లక్షలు లభిస్తాయి. అదే 45 ఏళ్లు అయితే రూ. 56 లక్షలు వస్తాయి.. ప్రస్తుతం ఇందులో వడ్డీ రూ.7.1 గా ఉంది..

Read more RELATED
Recommended to you

Exit mobile version