కేంద్రం నుంచి కొత్త స్కీమ్.. 18 ఏళ్ళలోపు ఉన్న పిల్లలుంటే వెంటనే చేరొచ్చు..!

-

కేంద్ర ప్రభుత్వం అనేక రకరకాల పథకాలను తీసుకొస్తోంది. కేంద్రం అందిస్తున్న పథకంలో డబ్బులు పెట్టడం వలన భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండొచ్చు. రిటైర్మెంట్ తర్వాత తల్లిదండ్రులు ఇన్వెస్ట్ చేయడానికి అవ్వదు. రిటైర్మెంట్ తర్వాత ఆదాయం కూడా ఉండదు. అలాంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం అందించే స్కీముల్లో డబ్బులు పెట్టుకోవడం వలన భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు ఉండకుండా ఉంటాయి. నేషనల్ పెన్షన్ స్కీం ప్రజలకి మంచి రిటర్న్స్ ని ఇస్తోంది. ఇప్పటికే ఉన్న NPS స్కీం కి NPS వాత్సల్య పొడిగింపు అని.. పిల్లల కోసం దీనిని తీసుకువచ్చామని నిర్మల సీతారామన్ వెల్లడించారు.

గత పదేళ్లలో NPS సబ్స్క్రైబర్లు 1.86 కోట్లకు పెరిగారు. ఈ స్కీమ్ కింద ఉన్న ఏయూఎం 13 లక్షల కోట్లకు చేరుకుంది. ఈ ఏడాది యూనియన్ బడ్జెట్ లో NPS వాత్సల్య స్కీంని ప్రభుత్వం ప్రకటించింది. తల్లిదండ్రులు పిల్లల కోసం మీ స్కీమ్ ని ఓపెన్ చేయచ్చు. పిల్లల వయసు 18 ఏళ్లు దాటిన తర్వాత NPS వాత్సల్య అకౌంట్ సాధారణ ఎన్పీఎస్ అకౌంట్ గా మారిపోతుంది. 18లో లోపు ఉన్న వాళ్లకోసం అకౌంట్ ఓపెన్ చేయడానికి అవకాశం ఉంటుంది. పిల్లలు, తల్లిదండ్రులు ఇద్దరు ఇండియన్ సిటిజన్స్ అయ్యి ఉండాలి 18 ఏళ్లు దాటిన తర్వాత ఎన్పీఎస్ వాత్సల్య అకౌంట్ లోని అమౌంట్ 2.5 లక్షలు లోపు ఉంటే మొత్తం విత్ డ్రా చేయొచ్చు.

ఒకవేళ 20 అది దాటితే 20 శాతం అమౌంట్ శాతం అమౌంట్ మెచ్యూరిటీ అయ్యాక లంప్ సమ్ ని పొందవచ్చు. ఒకవేళ సబ్స్క్రైబర్లు చనిపోతే నామినీకి లేదా లీగల్ గార్డెన్ కి అమౌంట్ వెళ్తుంది. NPS వాత్సల్య అకౌంట్ ని ఓపెన్ చేసేటప్పుడు మూడు ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. ఒకటి డిఫాల్ట్ ఛాయిస్. రెండవది ఆటో ఛాయిస్. అలాగే మూడవది వచ్చేసి ఆక్టివ్ ఛాయిస్. ఇలా మూడు ఆప్షన్స్ అయితే ఉన్నాయి. NPSలాగే ఇలా ఈ స్కీమ్ తో కూడా బెనిఫిట్స్ ని పొందవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news