ప్రతి ఒక్కరి జీవితంలో డబ్బును పొదుపు చేయడం ఎంతో అవసరం. ఈ మధ్యకాలంలో ధరలు పెరగడంతో ఖర్చులు చాలా ఎక్కువ అవుతున్నాయి. దీంతో పొదుపు చేయాలి అనే ఆలోచన రావడం లేదు. ఈ విధంగా సమస్యలు ఎదురైనప్పుడు ఎలాంటి పొదుపు చేసిన ధనం ఉండడం లేదు. అయితే భారతదేశంలోని పెట్టుబడిదారులను ఆకర్షించడానికి కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను తీసుకురావడం సహజమే. వాటితో పాటుగా పోస్ట్ ఆఫీస్ లు కూడా ఎన్నో పథకాల ద్వారా ప్రజలను ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలు ప్రజలకు అవగాహన లేకపోవడం వలన పోస్ట్ ఆఫీస్ ద్వారా ఎంతో సులభంగా పథకాలను ఉపయోగించుకుంటున్నారు. ముఖ్యంగా నెలవారీ ఆదాయాన్ని ఇచ్చేటువంటి పథకాల పై ఎక్కువ ఆసక్తి కూడా ఉంటుంది. వాటిలో భాగంగా పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ కూడా ఒకటి.
అర్హత వివరాలు:
పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ పథకానికి దరఖాస్తు చేసుకునేవారు కనీసం 18 ఏళ్లు పూర్తయ్యి ఉండాలి మరియు భారతదేశ పౌరులు మాత్రమే ఈ పథకానికి అర్హులు. పది ఏళ్ళు పూర్తి అయిన వారు తల్లిదండ్రులు లేక గార్డియన్ల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు చేసుకునే విధానం:
ఈ పథకం ద్వారా ప్రయోజనాలను పొందాలంటే ముందుగా పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ ని తప్పకుండా ఓపెన్ చేయాల్సి ఉంటుంది. పోస్ట్ ఆఫీస్ అధికారిక వెబ్సైట్ ద్వారా పథకానికి సంబంధించిన అప్లికేషన్ ను డౌన్లోడ్ చేయవచ్చు లేక దగ్గర లో ఉండేటువంటి పోస్ట్ ఆఫీస్ కు వెళ్లి అప్లికేషన్ ను పూరించవచ్చు. అప్లికేషన్ ను నింపిన తర్వాత దానితో పాటుగా ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో వంటి మొదలైన డాక్యుమెంట్లను అందచేయాలి. పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ లో భాగంగా కనీసం వెయ్యి రూపాయలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా 9 లక్షల వరకు డిపాజిట్ లను చేయవచ్చు. ఈ పథకానికి సంబంధించి పదవి కాలం ఐదు సంవత్సరాలు మరియు వడ్డీ రేటు ప్రతి సంవత్సరానికి 7.4% వరకు ఉంటుంది. పైగా నెలవారీ వడ్డీ కూడా మీ ఖాతాలో జమ అవుతుంది.