ఈ స్కీమ్ తో రూ.7 లక్షలకు పైగా లాభం..!

-

కేంద్రం ఎన్నో రకాల స్కీమ్స్ ని ప్రజలకి ఇస్తోంది. వీటి వలన ప్రజలకి చక్కటి లాభాలు కలుగుతాయి. కేంద్రం అందించే స్కీమ్స్ లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ PPF కూడా ఒకటి. ఈ స్కీమ్ వలన కూడా అదిరే లాభాలని పొందొచ్చచు. పైగా ఈ స్కీమ్ వలన ఎలాంటి రిస్క్ కూడా ఉండదు. లాభాలు కూడా ఎక్కువే ఉంటాయి. అలానే ఈ స్కీమ్ ద్వారా ఆకర్షణీయ రాబడి వస్తుంది.

money

ట్యాక్స్ బెనిఫిట్స్ ని కూడా పొందొచ్చు. ఇక ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాల లోకి వెళితే.. పీపీఎఫ్ స్కీమ్ మెచ్యూరిటీ కాలం 15 ఏళ్లు. మీరు 15 ఏళ్ల పాటు డబ్బులు పెడుతూ వెళ్ళాలి. ఇది ఇలా ఉంటే ఇప్పుడు ఈ వడ్డీ వచ్చేసి 7.1 శాతంగా వుంది. అలానే ఈ వడ్డీ రేట్లు మూడు నెలలకి ఓ సారి మారుతాయి.

ఈ స్కీమ్ లో ఒక ఆర్థిక సంవత్సరంలో మీరు ఎంత వరకు పెట్టచ్చు అనేది చూస్తే.. పీపీఎఫ్ ఖాతాలో గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చెయ్యచ్చు. రూ.500 డిపాజిట్ చేసినా చాలు. అయితే మీ పెట్టుబడిని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది.

మీరు నెలకు రూ.5 వేలు పీపీఎఫ్ ఖాతాలో పెడితే… నెలకు రూ.5 వేలు 15 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేయాలి. మీ చేతికి మెచ్యూరిటీ తర్వాత రూ.16.27 లక్షలు వస్తాయి. అంటే మీరు రూ.9 లక్షలు పెడితే రూ.7.27 లక్షలు లాభాన్ని పొందొచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news