భారతదేశంలో ఉండేటువంటి ఎంఎస్ఎంఈ లకు సహాయాన్ని అందించడానికి కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని ప్రారంభించడం జరిగింది. అదే స్కీమ్ ఆఫ్ ఫండ్ ఫర్ రీజనరేషన్ ఆఫ్ ట్రెడిషనల్ ఇండస్ట్రీస్. ఈ పథకం ద్వారా మన దేశంలో ఉండేటువంటి పరిశ్రమలను అభివృద్ధి చేయడానికి మరియు లాభాలను పెంచడానికి ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ఉత్పత్తులు పెరుగుతాయి దీంతో మార్కెట్ సామర్థ్యాన్ని కూడా పెంచవచ్చు అని అమలు చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ పథకంతో కళాకారుల నైపుణ్యాలు కూడా మెరుగుపడతాయి మరియు గుర్తింపు పెరుగుతుంది. చాలా మంది చేతివృత్తుల వారికి ఆర్థిక సహాయం అందుతున్నా సరే పరికరాలకు సంబంధించి సరైన సహాయం లేదు. అయితే ఈ పథకం ద్వారా చేతివృత్తుల వారికి క్లస్టర్ల వారిగా ఆర్ధిక సహాయాన్ని మరియు పరికరాలను అందించడం జరుగుతుంది.
అర్హత వివరాలు:
ఈ పథకానికి కొన్ని సంస్థలు అర్హులు. రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల క్షేత్రస్థాయి కార్యదర్శులు, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల సంస్థలు, కార్పొరేట్లు మరియు కార్పొరేట్ బాధ్యత పునాదులు, ఎన్జీవోలు, పంచాయతీరాజ్ సంస్థలు.
పథకం ద్వారా పొందే ప్రయోజనాలు:
గ్రామీణ ప్రాంతాలలో నివసించే హస్త కళాకారుల నైపుణ్యాలు మరియు సామర్ధ్యాలను మెరుగుపరచడానికి ప్రత్యేక శిక్షణను ఇస్తున్నారు. అంతేకాకుండా కళాకారులకు మరియు ఇతర కార్మికులకు ఎన్నో సౌకర్యాలను అందజేస్తున్నారు. ఈ కామర్స్ ని ఉపయోగించి స్థానిక కళాకారులను వారి ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా కొనుగోలు చేసే విధంగా మార్కెట్ కి అందించడానికి ప్రోత్సాహిస్తున్నారు.
దరఖాస్తు చేసే విధానం:
స్కీమ్ ఆఫ్ ఫండ్ ఫర్ రీజనరేషన్ ఆఫ్ ట్రెడిషనల్ ఇండస్ట్రీస్ పథకానికి దరఖాస్తు చేసుకుని రుణం పొందాలంటే మీ ప్రాంతంలో ఉండేటువంటి రాష్ట్ర కార్యాలయం వద్ద కెవిఐసికి దరఖాస్తు చేసుకోవాలి. దీనిని పూర్తిచేసి అధికారులకు అందజేసిన తరువాత ఆమోదనను పొందవచ్చు. ఈ విధంగా ఆమోదన పొందిన తరువాత రుణాన్ని మంజూరు చేయడం జరుగుతుంది.