సంగారెడ్డిలో దారుణం..ప్రియుడిని చంపిన ప్రియురాలి తండ్రి !

-

సంగారెడ్డిలో దారుణం జరిగింది. ప్రియుడిని ప్రియురాలి తండ్రి చంపిన సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. సూర్యాపేట ఘ‌ట‌న మ‌ర‌వ‌క‌ముందే మ‌రో దారుణం తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకుంది. కూతురిని ప్రేమిస్తున్నాడ‌ని యువ‌కుడిని హ‌త్య చేశాడట యువ‌తి తండ్రి. సంగారెడ్డి జిల్లా నిజాంపేట‌లో ఈ ఘ‌ట‌న జరిగింది.

An atrocity happened in Sangareddy. The incident where the boyfriend was killed by the girlfriend’s father has recently come to light

యువ‌కుడు ద‌శ‌ర‌థ్ డెడ్‌బాడీను ముక్క‌లు ముక్క‌లుగా న‌రికిన నిందితుడు.. చెరువులో వేసినట్లు సమాచారం అందుతోంది. ఐదురోజుల త‌ర్వాత డెడ్‌బాడీ ల‌భ్య‌మైంది. దీంతో… యువ‌కుడు ద‌శ‌ర‌థ్ కుటుంబ సభ్యులు నిరసనకు దిగారు. తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. ఇందులో భాగంగానే.. రోడ్డు పైకి వచ్చారు బాధితులు. దీం తో…. ట్రాఫిక్ సమస్య తలెత్తింది.  ఇక ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news