కేంద్ర ప్రభుత్వం 2025-26 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ కోసం కనీస మద్దతు ధర (MSP) కింద ధాన్యం కొనుగోలుకు 3 లక్షల కోట్లకు పైగా కేటాయించింది. ఈ నిర్ణయం రైతులకు గిట్టుబాటు ధరను కల్పించడం వ్యవసాయ ఉత్పత్తులను పెంచడం మరియు దేశీ ఆహార భద్రతను పటిష్టం చేయడం లక్ష్యంగా చేసుకుంది. తెలంగాణలో MSP కింద ధాన్యం, పత్తి సేకరణకు కేంద్రం నిధులు విడుదల చేయడం జరిగింది. మరి పూర్తి వివరాలలోకి వెళితే..
కేంద్ర వ్యవసాయ శాఖ సిఫారసుల మేరకు 14 ఖరీఫ్ పంటలకు MSP పెంచడం ద్వారా రైతుల కు ఆదాయాన్ని కల్పించే ఉద్దేశంతో కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ఖరీఫ్ సీజన్ లో వరి జొన్న సజ్జలు, రాగులు, పప్పు ధాన్యాలు, నూనె గింజలు, పత్తి వంటి పంటలకు MSP పెంపు జరిగింది. ఇలా పెంచడం రైతులకు ఉత్పత్తి వ్యయంపై కనీసం 50% లాభం లభించాలన్న ఉద్దేశంతో రూపొందించారు.

MSP కింద కేటాయింపు వివరాలు: వరి పంటకు క్వింటాకు రూ.69 పెంపుతో MSP 2,369 రూపాయలకు చేరింది. జొన్న క్వింటాకు రూ.328 పెంచబడి ధర 3,699కి చేరింది. కంధి క్వింటాకు 450 రూపాయల పెంపుతో ధర రూ. 8,000చేరింది. పత్తి క్వింటాకు 589 రూపాయలు పెంచబడి ధర 8,110 కి చేరింది. ఖరీఫ్ సీజన్ కోసం MSP కింద ధాన్యం కొనుగోలుకు 2.70 లక్షల కోట్లు కేటాయించబడ్డాయి. మొత్తం వ్యవసాయ సంబంధిత కార్యక్రమాలకు 3 లక్షల పైగా బడ్జెట్ విడుదల చేయబడింది.
ధాన్యం సేకరణ: 2014 -15 నుండి 2024 -25 వరకు 7,608 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించబడింది. ఇందులో ఖరీఫ్ పంటలు 7,871 లక్షల మెట్రిక్ టన్నులు ఉన్నాయి. తెలంగాణలో 2025 యాసంగి సీజన్లో 72.65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ఇది కేంద్రం నిర్దేశించిన 70 లక్షల టన్నుల లక్ష్యాన్ని కూడా మించిపోయింది. దీంతో రూ.15,500 కోట్లు రైతుల ఖాతాలో జమ చేయబడ్డాయి. నిజామాబాద్ జిల్లా 8.23 లక్షల మెట్రిక్ టన్నులతో అగ్రస్థానంలో నిలిచింది.
MSP కింద ధాన్యం కొనుగోలు రూ.3 లక్షల కోట్లకు పైగా కేటాయించడం రైతుల ఆర్థిక శ్రేయస్సును మెరుగుపరచడంలో కేంద్ర ప్రభుత్వం యొక్క నిబద్ధతను సూచిస్తుంది.