పీఎం కిసాన్ పథకంలో మార్పులు..!

-

చాలా మంది రైతులు పీఎం కిసాన్ ద్వారా డబ్బులని పొందుతున్నారు. దీనితో ఆర్ధికంగా కాస్త కేంద్రం రైతులకి హెల్ప్ చేస్తోంది. పీఎం కిసాన్ వెబ్ సైట్ లోకి వెళ్లి రైతులు తమకి కావాల్సిన సమాచారాన్ని పొందొచ్చు. అలానే స్టేటస్ ని కూడా ఈజీగా చూసుకొచ్చు. ముందుగా PM కిసాన్ పోర్టల్‌ని సందర్శించడం ద్వారా ఏ రైతు అయినా తన ఆధార్ నంబర్, లేదా బ్యాంక్ ఖాతాను నమోదు చేసి ఎవరైనా సరే స్టేటస్ ని చూసుకొచ్చు.

దీనిలో నమోదు చేసుకున్న తర్వాత రైతులు తమ స్టేటస్ ని స్వయంగా చూడచ్చు. అప్లికేషన్ స్థితి ఏమిటి, ఖాతాలో ఎంత ఇన్‌స్టాల్‌మెంట్ వచ్చింది ఇలాంటి వాటిని చెక్ చేసుకునే అవకాశం ఉండేది. అయితే ఇప్పుడు ఆ అవకాశం లేదు. తాజా మార్పుల కారణంగా PM కిసాన్ పోర్టల్‌లో నంబర్ నుండి ఈ స్టేటస్ ని చూడలేరు.

కేవలం ఇప్పుడు వారు తమ ఆధార్ నంబర్ లేదా బ్యాంక్ ఖాతా నంబర్ నుండి మాత్రమే తెలుసుకునే అవకాశం వుంది. అయితే మొబైల్ నెంబర్ తో ఈజీగా చెక్ చేసుకోచ్చు, కానీ దీని వలన ఎంత లాభం ఉందొ అంతే నష్టం కూడా వుంది.

చాలా మంది ఎవరి మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేసి స్టేటస్‌ని చెక్ చేసేవారు. కానీ ఇప్పుడు దీన్ని చేయడం కష్టం అవుతుంది. ఈ మార్పు వలన 12 కోట్ల 44 లక్షల మందికి పైగా రైతులపై ప్రత్యక్ష ప్రభావం పడనుందని తెలుస్తోంది. కొద్దిరోజుల కిందట లబ్ధిదారులకు ఈ-కేవైసీ తప్పనిసరి చేశారు. ఇక ఇది ఇలా ఉంటే ఈ స్కీమ్ మొదలైనప్పటి నుండి 7 మార్పులు జరిగాయి

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version