LIC పాలసీదారులకు చౌక వడ్డీకే రుణాలు..!

-

చాలా మంది ఏదైనా అవసరం అయితే లోన్ ని తీసుకుంటూ వుంటారు. అయితే లోన్స్ లో చాలా రకాలు మనకి అందుబాటులో వున్నాయి. బ్యాంకులు నుండి అయితే సులభంగా రుణం లభిస్తుంది. కానీ రుణ అర్హత లేకపోతే ఇబ్బంది పడాలి. కానీ మీకు కనుక ఎల్‌ఐసీ పాలసీ వుంది ఉంటే పర్సనల్ లోన్ పొందొచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాలలోకి వెళితే..

LIC
LIC

దేశీ దిగ్గజ బీమా రంగ కంపెనీ ఎల్ఐసీ తన కస్టమర్లకు పలు రకాల బెనిఫిట్స్ ని ఇస్తోంది. అయితే ఇందులో లోన్ ఫెసిలిటీ కూడా వుంది. అంటే మీరు ఎల్‌ఐసీ పాలసీ తీసుకొని ఉంటే సులభంగా రుణం పొందొచ్చు. ఎల్‌ఐసీలో తక్కువగానే వడ్డీరేట్లు వున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఇతర ప్రైవేట్ రంగ బ్యాంకులతో పోలిస్తే రుణాలపై వడ్డీ రేట్లు ఎల్‌ఐసీలో తక్కువగానే ఉంటాయి.

ఎల్‌ఐసీ పర్సనల్ లోన్స్‌పై వడ్డీ రేటు 9 శాతం నుంచి స్టార్ట్ అవుతోంది. అయితే ఎంత లోన్ వస్తుంది అనేది మీ ఆదాయం బట్టీ ఉంటుంది. లోన్ అమౌంట్ పాలసీ సరెండర్ విలువపై (90 శాతం వరకు) కూడా ఆధారపడుతుంది. ఒకవేళ కనుక మీ పాలసీ సరెండర్ వ్యాల్యూ రూ.5 లక్షలుగా ఉంటే రూ.4.5 లక్షల వరకు రుణం పొందొచ్చు.

ఎల్‌ఐసీ అందిస్తున్న రుణాన్ని ఐదేళ్లలోగా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. అంటే మీకు నచ్చిన లోన్ టెన్యూర్ ఎంపిక చేసుకోవచ్చు. ఇది ఇలా ఉంటే రెండేళ్ల టెన్యూర్‌తో తీసుకుంటే ఈఎంఐ రూ.4568 అవుతుంది. మూడేళ్ల టెన్యూర్ అయితే రూ.3180 ఈఎంఐ పడుతుంది. నాలుగేళ్ల టెన్యూర్ ఆప్షన్ అయితే ఈఎంఐ రూ.2489 అవుతుంది.

ఇక ఐదేళ్ల లోన్ టెన్యూర్‌తో లోన్ తీసుకుంటే ఈఎంఐ రూ.2076 కట్టాలి. ఐదేళ్ల టెన్యూర్‌తో రూ.5 లక్షల రుణం అయితే ఈఎంఐ దాదాపు రూ.13 వేలు పడుతుంది. లోన్ పొందడానికి ఎలైసి వెబ్సైట్ నుండి అప్లై చేసుకోచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news