గర్భిణులకు గుడ్ న్యూస్.. రూ.11,000 మీవే..!

-

కేంద్రం ఎన్నో రకాల స్కీమ్స్ ని తీసుకు వస్తూనే వుంది. ఈ స్కీమ్స్ వలన చాలా మంది కి ప్రయోజనాలు కలుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన స్కీమ్స్ లో ప్రధాన మంత్రి మాతృత్వ వందన యోజన కూడా ఒకటి. ఈ స్కీమ్ తో పలు లాభాలు కలుగుతాయి. ఈ స్కీము కింద గర్భిణులకు ప్రభుత్వం ఆర్థిక సహాయం ఇస్తుంది. నవజాత శిశువుల సంరక్షణ, వ్యాధుల నివారణకు రూ.5000 ఇస్తుంది. గర్భిణీ స్త్రీల వయస్సు 19 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండాలి.

 

మహిళలు కోసమే ఈ స్కీమ్ ని తీసుకు వచ్చారు. ఈ డబ్బులు మొత్తం నేరుగా మహిళల ఖాతా లో పడతాయి. మొత్తం రూ.5000 వాయిదాల పద్ధతిలో ఇస్తారు. మొదటి విడత రూ.1000, రెండో విడత రూ.2000, మూడో విడత రూ.2000 అందజేస్తున్నారు. తొలి కాన్పులో ఆడ లేదా మగ బిడ్డ పుట్టినప్పటికీ మూడు దశల్లో రూ.1000, ఆరు నెలల తర్వాత రూ.2000, ప్రసవం జరిగిన 14 వారాల్లో రూ.2000 చొప్పున ఇస్తారు.

ఇటీవల గర్భం దాల్చిన మహిళలకు రూ.3,000, ప్రసవం జరిగిన 14 వారాలకు రూ.2,000 చొప్పున రెండు ఇన్స్టాల్మెంట్స్ లోనే ఇస్తున్నారు. రెండో కాన్పులో పాప పుడితే తల్లికి రూ.6,000 ఇస్తుంది. ఇలా మొత్తం 11 వేల రూపాయల వరకు కేంద్రం నుంచి గర్భిణులకు ఈ స్కీమ్ కింద పొందవచ్చు. PMMVY wcd.nic.in/schemes/pradhan-mantri-matru-vandana-yojana అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version