ఎల్‌ఐసీ పాలసీ హోల్డర్ మరణిస్తే డబ్బులు క్లైయిమ్‌ చేసుకోవడం ఎలా..?

-

కొంతమంది ఎల్‌ఐసీలో ఏదో ఒక పాలసీ తీసుకుంటారు. అది కొన్నిసార్లు ప్రీమియం చెల్లించిన తర్వాత మానేస్తారు, గతంలో పాలసీలు తీసుకొని, టైమ్‌కు ప్రీమియంలు చెల్లించినవారు కూడా వాటిని క్లెయిమ్ చేసుకోవట్లేదు. పాలసీహోల్డర్ మరణిస్తే, ఆ పాలసీకి సంబంధించిన సమాచారం నామినీల దగ్గర లేకపోవడంతో ఆ డబ్బుల్ని ఎవరూ క్లెయిమ్ చేయట్లేదు. ఇలా కస్టమర్లు మర్చిపోయిన డబ్బుల్ని ఎల్ఐసీ నుంచి తిరిగిపొందొచ్చు. మీరు పాలసీహోల్డర్ అయినా లేదా మీ కుటుంబ సభ్యుల పాలసీలకు మీరు నామినీగా ఉన్నా ఎల్ఐసీ నుంచి ఈ డబ్బుల్ని క్లెయిమ్ చేయొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

మెచ్యూరిటీ తర్వాత పాలసీ డబ్బుల్ని క్లెయిమ్ చేసుకోకపోవడం లేదా పాలసీహోల్డర్ మరణించిన తర్వాత నామినీ డబ్బుల్ని క్లెయిమ్ చేయకపోవడం వల్ల ఎల్ఐసీ దగ్గర అన్‌క్లెయిమ్డ్ ఫండ్స్ జమ అవుతున్నాయి. వాటిని కస్టమర్లు లేదా నామినీలు సులువుగా క్లెయిమ్ చేయొచ్చు. ఎల్ఐసీ తమ కస్టమర్లు మర్చిపోయిన డబ్బుల్ని, క్లెయిమ్ చేయని మొత్తాన్ని తిరిగి చెల్లిస్తుంది. అయితే కస్టమర్లు లేదా నామినీలు ఆ వివరాలను ముందుగా ఎల్ఐసీ అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేయాలి. పాలసీ నంబర్, పాలసీదారు పేరు, పుట్టిన తేదీ, పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి ఈ వివరాలు సెర్చ్ చేయొచ్చు. ఎల్ఐసీలో అన్‌క్లెయిమ్డ్ అమౌంట్ చెక్ చేయడానికి ఈ స్టెప్స్ ఫాలో కావాలి.

ముందుగా ఎల్ఐసీ అధికారిక వెబ్‌సైట్ https://www.licindia.in/home ఓపెన్ చేయాలి.

హోమ్ పేజీలో కిందకు స్క్రోల్ చేసి Unclaimed Amounts of Policyholders లింక్ పైన క్లిక్ చేయాలి.

ఎల్ఐసీ పాలసీ నెంబర్, పాలసీహోల్డర్ పేరు, పుట్టిన తేదీ, పాన్ కార్డ్ నెంబర్లను ఎంటర్ చేయాలి.

వీటిలో పాలసీ హోల్డర్ పేరు, పుట్టిన తేదీ తప్పనిసరిగా ఎంటర్ చేయాలి.

ఈ వివరాలు ఎంటర్ చేసి సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేస్తే స్క్రీన్ పైన డీటెయిల్స్ కనిపిస్తాయి.

ఒకవేళ ఎల్ఐసీ నుంచి డబ్బులు రావాల్సి ఉంటే ఆ వివరాలతో సమీపంలో ఉన్న ఎల్ఐసీ ఆఫీసుకి వెళ్లి క్లెయిమ్ సబ్మిట్ చేయాలి. ఎల్ఐసీ నుంచి డబ్బులు క్లెయిమ్ చేయడానికి పాలసీహోల్డర్‌కు సంబంధించిన ఐడీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, పాలసీ డాక్యుమెంట్, నామినీకి సంబంధించిన ప్రూఫ్స్ తప్పనిసరిగా కావాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version