రూ.50 కడితే రూ.6 లక్షలు.. అదిరింది కదా ఈ LIC పాలసీ..!

-

చాలా మంది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అందించే స్కీమ్స్ లో డబ్బులు పెడుతున్నారు. అయితే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పాలసీల్లో డబ్బులు పెడితే మంచిగా లాభాలు ఉంటాయి. ఎన్నో రకాల పాలసీలను లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అందిస్తోంది. ఎల్ఐసీ అందిస్తున్న వాటిలో ఆధార్ శిలా కూడా ఒకటి. ఈ ప్లాన్ కేవలం మహిళలకు మాత్రమే. ఇక దీని వివరాలు చూసేద్దాం.

నాన్ లింక్డ్ ఇండివీజువల్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్. ఒకవేళ కనుక పాలసీ దారుడు మరణిస్తే అప్పుడు నామినీకి బీమా మొత్తం లభిస్తుంది. పాలసీదారుడు జీవించి ఉంటే మెచ్యూరిటీ సమయంలో ఓసారి డబ్బులు వస్తాయి. 8 నుంచి 55 ఏళ్ల వాళ్ళు ఈ పాలసీకి అర్హులే. 10 నుంచి 20 ఏళ్ల వరకు టెన్యూర్ ఉంటుంది. నచ్చిన టెన్యూర్‌తో పాలసీ తీసుకోవచ్చు. రూ. 75 వేల బీమా మొత్తానికి దీన్ని తీసుకోవాలి. గరిష్టంగా రూ. 3 లక్షల వరకు తీసుకోవచ్చు.

ఉదాహరణకు రూ.3 లక్షల బీమా మొత్తానికి పాలసీ ని 30 ఏళ్లు వాళ్ళు తీసుకుంటే నెలకు దాదాపు రూ.900 పే చేయాలి. అంటే రోజుకు దాదాపు రూ.30 పొదుపు చేయాలి. ఇలా చేస్తే రూ. 3 లక్షలు పొందొచ్చు. మీ కూతురి పేరుపై కూడా బీమా పాలసీ తీసుకోవచ్చు. అప్పుడు అదనపు ప్రీమియం కట్టాల్సి వస్తుంది. మీ కూతురి వయసు 15 ఏళ్లు అయితే నెలవారీ ప్రీమియం రూ. 870 దాకాపడుతుంది. 20 ఏళ్ల టెన్యూర్ కింద చూస్తే మెచ్యూరిటీలో రూ. 3 లక్షలకు పైనే మీకొస్తాయి. నెలకు రూ.1570 ప్రీమియంతో రూ. 6 లక్షలు మీకొస్తాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version