తక్కువ వడ్డీకే LIC నుండి రెండు కోట్ల వరకు రుణాలు..!

-

మీరు సొంతింటి కలని సాకారం చేసుకోవాలని అనుకుంటున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. తక్కువ వడ్డీ రేటుకే హోమ్ లోన్స్ ని ఇస్తోంది LIC. దీనితో సొంతింటి కలని సాకారం చేసుకోవచ్చు. ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ తక్కువ వడ్డీ రేటుకే హోమ్ లోన్స్ ని అందిస్తోంది. దీనితో మీరు రూ.2 కోట్ల వరకు రుణాన్ని 6.66 శాతం వడ్డీ రేటుకే పొందొచ్చు అని LIC తెలిపింది.

 

LIC

ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. సొంతింటి కలని సాకారం చేసుకోవాలని అనుకునే వాళ్ళు రూ.2 కోట్ల వరకు రుణాన్ని 6.66 శాతం వడ్డీ రేటుకే పొందొచ్చు. ఇది నిజంగా చాలా మంది రిలీఫ్ గా ఉంటుంది. ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ జూలై 1 నుంచే 6.66 శాతం వడ్డీ రేటుకు హోమ్ లోన్స్ అందిస్తూ వస్తోంది.

అయితే ఒకవేళ హోమ్ లోన్ ని రూ.50 లక్షల దాక తీసుకుంటేనే ఈ రేటు వర్తించేది. అయితే ఇప్పుడు రూ.2 కోట్ల వరకు రుణాన్ని ఇదే వడ్డీ రేటుతో తీసుకోవచ్చు. ఒకవేళ తక్కువ వడ్డీ రేటుకే లోన్ తీసుకోవాలంటే రుణ గ్రహీతల క్రెడిట్ స్కోర్ 700 లేదా ఆపైన ఉండాలి. అప్పుడే వీరికి 6.66 శాతం వడ్డీ రేటు వర్తిస్తుంది.

ఇది ఇలా ఉంటే ఈ ఆఫర్ కేవలం నవంబర్ 30 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అదే విధంగా హోమ్ లోన్‌పై ప్రాసెసింగ్ ఫీజు మాఫీ చేస్తోంది. రూ.10 వేల వరకు తగ్గింపు పొందొచ్చు. అంతేకాకుండా 6 ఈఎంఐల మాఫీ ప్రయోజనం కూడా ఉంది. ఈ హోమ్ లోన్స్ తీసుకోవాలంటే ఆన్ లైన్ లో అప్లై చెయ్యచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version