సన్యాసి అంటావా.. వెంటనే క్షమాపణలు చెప్పాల్సిందే : మంత్రి అవంతి

-

విశాఖ : పవన్ కళ్యాణ్ కామెంట్స్ పై మంత్రి అవంతి శ్రీనివాస్ ఫైర్ అయ్యారు.. ముఖ్యమంత్రి, మంత్రుల పై చేసిన వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ వెనక్కి తీసుకోని.. వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పవన్ మానశిక స్థితి పై అనుమానం కలుగుతోందని.. పవన్ కల్యాణ్ తన వ్యాఖ్యల ద్వారా పలుచనైపోతున్నారన్నారు… సినిమా వేదికను రాజకీయ వేదికగా మార్చారని… పవన్ కళ్యాణ్ రాష్ట్రం లోనే, ఉండరు….రాష్ట్రం ఆయన సినిమాలన్నీ ఫారెన్ లోనే తీస్తారు.. ఏపీ లో ఎందుకు తీయరు ? అని నిలదీశారు మంత్రి అవంతి.

పెద్దలు చిరంజీవి, మోహన్ బాబు పై కూడా ఆయన మాట్లాడిన తీరు సరైంది కాదని.. సినిమాల్లోకి వచ్చి పదేళ్ల కూడా అవ్వని పవన్ కళ్యాణ్ మొత్తం ఇండస్ర్టీ అంతటికీ నష్టం జరుగుతుందని ఎలా మాట్లాడతారని ఫైర్ అయ్యారు. హిట్ సినిమాలు కొత్త కొత్త నటీనటులకి వస్తున్నాయి….డబ్బింగ్ సినిమాలను అదరించే గొప్ప అభిమానం తెలుగు ప్రేక్షకులదన్నారు.. మంత్రులను సన్నాసులు అంటున్నారు…ఈ తరహా వ్యాఖ్యలు ఏ సిద్దాంతం నేర్పిందని ఫైర్ అయ్యారు.

టిక్కెట్ల ఆన్లైన్ విధానం పై ఆయన తప్పుదోవ పట్టిస్తున్నారు.. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత దూషణలు, బూతులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పార్టీ అధినేత ఇలా మాట్లాడితే క్రింది స్థాయి నాయకులు, కార్యకర్తలు ఎలా ప్రవర్తిస్తారని.. పార్టీని నడపాలంటే ఓర్పు, సహనం, ఉండాలి.. బ్యాలెన్స్ తప్పుతున్నారని ఏదేవ చేశారు. బుద్ధుడు గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్ ఓ పది రోజులు ధ్యాన కేంద్రం లో గడిపితే మంచిదేన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version