రూ.15 వేలు కంటే ఎక్కువ శాలరీ వస్తోందా..? అయితే మీకు శుభవార్త…!

-

మీరు అధికారిక రంగంలో పని చేస్తున్నారా..? మీ జీతం రూ.15 వేలు కంటే ఎక్కువ వస్తోందా..? అయితే మీకు గుడ్ న్యూస్. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ రూ.15 వేల కంటే ఎక్కువ వస్తున్న వారికి సరికొత్త పెన్షన్ స్కీమ్ ని తీసుకొచ్చింది. దీనితో వారికి ఎంతో బెనిఫిట్ గా ఉంటుంది. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..

ప్రస్తుతం రూ.15 వేల వరకున్న బేసిక్ వేతనానికి(బేసిక్ పే, డీఏ) మాత్రమే ఈపీఎస్-95 కింద పెన్షన్‌ ని తీసుకునే అవకాశం వుంది. రూ.15 వేల కంటే ఎక్కువ బేసిక్ వేతనం ఉన్న వారు కూడా తక్కువగానే పెన్షన్ తీసుకోవాల్సి ఉంటోంది. అయితే వీరి యొక్క డిమాండ్ ఏమిటంటే ఎక్కువ కంట్రిబ్యూషన్‌పై ఎక్కువ పెన్షన్ ఇవ్వాలని.

పైగా జీతాన్ని బట్టి పెన్షన్ ఉండాలని అంటున్నారు. ఈ లిమిట్ ని తొలగించాలని అంటున్నారు. అయితే వీళ్ళ డిమాండ్ పై కొత్త పెన్షన్ స్కీమ్‌ను తీసుకు రావాలని ప్రభుత్వం అనుకుంటోంది. ఈ స్కీమ్‌ను నెలకు రూ.15 వేల కంటే ఎక్కువ శాలరీ వచ్చే వాళ్ళ కోసం తీసుకు రావాలని అనుకుంటున్నారు. వచ్చే నెలలో జరిగే మీటింగ్ లో దీని పై నిర్ణయం తీసుకోనున్నారు. అలానే 15 నుండి ఈ పరిమితిని రూ.25 వేలకు పెంచాలని కోరుతున్నారు. అయితే ఇప్పటి వరకు అయితే దీనిని మార్చలేదు.

Read more RELATED
Recommended to you

Latest news